ఇంత బాఁతిపడేవాని నేల మాకుఁ దక్కరించ
(॥పల్లవి॥)
ఇంత బాఁతిపడేవాని నేల మాకుఁ దక్కరించ
చెంత నిదే వెన్నచిట్టిఁ జిట్టెఁడేసి వలపు
(॥ఇంత॥)
చేలకొంగువట్టితిసిగ్గువడఁగామానము
వాలుకరెప్పలు వంచివంచి చూచేవు
అలదొట్టివారము నేమంతేసి యెఱఁగము
వాలదుత్త దుత్తఁడేసి పట్టవయ్య వలపు
(॥ఇంత॥)
పెల్లుగఁ జేతులు పాపి పెనఁగఁగానే గుబ్బలు
కొల్లలుగాఁ జేతఁబట్టి గోర గీరేవు
గొల్లెతలమెఱఁగము గొప్పజాణతనములు
చలదుబ్బ దుబ్బెఁడేసిచల్లేమువలపు
(॥ఇంత॥)
కాయపుమదము గారఁగానే శ్రీవేంకటేశ
సోయగానఁ గూడి మరీ సోదించేవు
నేయమ్మే వారము నవ్వనేరము పోసే మిదే
చేయి చాఁచు పెర్గుచిప్పఁ చిప్పఁడేసి వలపు
(||pallavi||)
iṁta bām̐tibaḍevāni nela māgum̐ dakkariṁcha
sĕṁta nide vĕnnasiṭṭim̐ jiṭṭĕm̐ḍesi valabu
(||iṁta||)
selagŏṁguvaṭṭidisigguvaḍam̐gāmānamu
vālugarĕppalu vaṁchivaṁchi sūsevu
aladŏṭṭivāramu nemaṁtesi yĕṟam̐gamu
vāladutta duttam̐ḍesi paṭṭavayya valabu
(||iṁta||)
pĕllugam̐ jedulu pābi pĕnam̐gam̐gāne gubbalu
kŏllalugām̐ jedam̐baṭṭi gora gīrevu
gŏllĕdalamĕṟam̐gamu gŏppajāṇadanamulu
saladubba dubbĕm̐ḍesisallemuvalabu
(||iṁta||)
kāyabumadamu gāram̐gāne śhrīveṁkaḍeśha
soyagānam̐ gūḍi marī sodiṁchevu
neyamme vāramu navvaneramu pose mide
seyi sām̐su pĕrgusippam̐ sippam̐ḍesi valabu