Impugaani sompugaani yeṟimgimchidi nidivo

ఇంపుగాని సొంపుగాని యెఱిఁగించితి నిదివో
Language

(॥పల్లవి॥)
ఇంపుగాని సొంపుగాని యెఱిఁగించితి నిదివో
జంపుల నీ గుణముల చంద మెట్టోకాని

(॥ఇంపు॥)
పలుకఁగవచ్చుఁగాని పంతములియ్యఁగరాదు
చెలితోడ జగడించఁ జెల్లదుసుమ్మీ
పలుకఁగరాదుసుమ్మీ పక్కన జాణతనాన
తొలఁగి పిమ్మట నటు దూరవచ్చుఁగాని

(॥ఇంపు॥)
కాఁకసేయవచ్చుఁగాని కలఁకదీర్చఁగరాదు
తేకువకు నెమ్మెకు తీదీపుసుమ్మీ
కాఁక సేయరాదుసుమ్మీ కమ్మర నేరుపుతోడ
వేఁకపునిష్టూర మందె వేయవచ్చుఁగాని

(॥ఇంపు॥)
జంకించవచ్చుఁగాని సారెకుఁ బొంకఁగరాదు
వంకలనేమీ ననవద్దు సుమ్మీ
జంకించరాదుసుమ్మీ సతిమనసు దెలిసి
కొంకక శ్రీవేంకటేశ కూడవచ్చుఁగాని

(||pallavi||)
iṁpugāni sŏṁpugāni yĕṟim̐giṁchidi nidivo
jaṁpula nī guṇamula saṁda mĕṭṭogāni

(||iṁpu||)
palugam̐gavachchum̐gāni paṁtamuliyyam̐garādu
sĕlidoḍa jagaḍiṁcham̐ jĕlladusummī
palugam̐garādusummī pakkana jāṇadanāna
tŏlam̐gi pimmaḍa naḍu dūravachchum̐gāni

(||iṁpu||)
kām̐kaseyavachchum̐gāni kalam̐kadīrsam̐garādu
teguvagu nĕmmĕgu tīdībusummī
kām̐ka seyarādusummī kammara nerubudoḍa
vem̐kabuniṣhṭūra maṁdĕ veyavachchum̐gāni

(||iṁpu||)
jaṁkiṁchavachchum̐gāni sārĕgum̐ bŏṁkam̐garādu
vaṁkalanemī nanavaddu summī
jaṁkiṁcharādusummī sadimanasu dĕlisi
kŏṁkaga śhrīveṁkaḍeśha kūḍavachchum̐gāni