Imkanemti maadalu yitte kamti nee nijamu

ఇంకనేఁటి మాటలు యిట్టె కంటి నీ నిజము
Language

(॥పల్లవి॥)
ఇంకనేఁటి మాటలు యిట్టె కంటి నీ నిజము
వంకలొత్తఁబోతేను కొంకరలయ్యీని

(॥ఇంక॥)
యెవ్వతెకస్తూరిబొట్టో ఇదె నీనొసలనంటె
చువ్వన నద్దములోన చూచుకోవయ్యా
నవ్వఁబోతే పెదవిపై నయానఁ గెంపులురేఁగె
యివ్వల చెక్కులపస పిరుమేలా నంటెను

(॥ఇంక॥)
కుంకుమగుబ్బలపూఁత గురిగా రొమ్మున నించె
సుంకుమోవఁ దలవంచి చూచుకోవయ్యా
పొంకపుచెవులతట్టుపుణుఁగు బుజాలఁ గారె
లంకెల హారములొత్తి లచ్చనలై వున్నవి

(॥ఇంక॥)
సమరతిచెమటలు చారలై నీమేన నిండె
సుముఖుఁడవై నీవే చూచుకోవయ్యా
అమర శ్రీవేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
జమళి ఇద్దరిచొప్పు సరి నీపైఁ బడెను

(||pallavi||)
iṁkanem̐ṭi māḍalu yiṭṭĕ kaṁṭi nī nijamu
vaṁkalŏttam̐bodenu kŏṁkaralayyīni

(||iṁka||)
yĕvvadĕgastūribŏṭṭo idĕ nīnŏsalanaṁṭĕ
suvvana naddamulona sūsugovayyā
navvam̐bode pĕdavibai nayānam̐ gĕṁpulurem̐gĕ
yivvala sĕkkulabasa pirumelā naṁṭĕnu

(||iṁka||)
kuṁkumagubbalabūm̐ta gurigā rŏmmuna niṁchĕ
suṁkumovam̐ dalavaṁchi sūsugovayyā
pŏṁkabusĕvuladaṭṭubuṇum̐gu bujālam̐ gārĕ
laṁkĕla hāramulŏtti lachchanalai vunnavi

(||iṁka||)
samaradisĕmaḍalu sāralai nīmena niṁḍĕ
sumukhum̐ḍavai nīve sūsugovayyā
amara śhrīveṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
jamaḽi iddarisŏppu sari nībaim̐ baḍĕnu