ఇంకనేఁటి మాటలే ఇయ్యకొనేదేగాక
(॥పల్లవి॥)
ఇంకనేఁటి మాటలే ఇయ్యకొనేదేగాక
పంకపుఁజెమటలు మైఁ బరగెఁ గదే
(॥ఇంక॥)
కడఁగి నీవలిగి గక్కన లేచి నిలుచుంటే
బెడిదపుటానలెల్లాఁ బెట్టీ నీపతి
వొడివట్టి తియ్యఁగాను వోపనంటాఁ బెనఁగఁగ
జడిసి పోఁకముడి జారెఁగదవే
(॥ఇంక॥)
పంతమున నీవు లోనిపరపుపైఁ బండితేను
చెంతల నాతఁడు నీచెక్కులు నొక్కె
కొంతఁగొంత చెనకఁగఁ గోపగించి తిట్టఁగాను
బంతినే సిగ్గులు నీరై పారెఁగదవే
(॥ఇంక॥)
ననుపున నింతలోనె నవ్వులు నీవు నవ్వితే
ఘనశ్రీవేంకటేశుఁడు కలసెఁగదే
మనసులు సోదించఁగా మరపులు మించఁగాను
నినుపులై పులకలు నిండెఁగదవే
(||pallavi||)
iṁkanem̐ṭi māḍale iyyagŏnedegāga
paṁkabum̐jĕmaḍalu maim̐ baragĕm̐ gade
(||iṁka||)
kaḍam̐gi nīvaligi gakkana lesi nilusuṁṭe
bĕḍidabuḍānalĕllām̐ bĕṭṭī nībadi
vŏḍivaṭṭi tiyyam̐gānu vobanaṁṭām̐ bĕnam̐gam̐ga
jaḍisi pom̐kamuḍi jārĕm̐gadave
(||iṁka||)
paṁtamuna nīvu lonibarabubaim̐ baṁḍidenu
sĕṁtala nādam̐ḍu nīsĕkkulu nŏkkĕ
kŏṁtam̐gŏṁta sĕnagam̐gam̐ gobagiṁchi tiṭṭam̐gānu
baṁtine siggulu nīrai pārĕm̐gadave
(||iṁka||)
nanubuna niṁtalonĕ navvulu nīvu navvide
ghanaśhrīveṁkaḍeśhum̐ḍu kalasĕm̐gade
manasulu sodiṁcham̐gā marabulu miṁcham̐gānu
ninubulai pulagalu niṁḍĕm̐gadave