ఇంకనేమి సేసేము యిన్నిటాఁ దనిసితిమి
(॥పల్లవి॥)
ఇంకనేమి సేసేము యిన్నిటాఁ దనిసితిమి
సంకెలెల్లాఁ దీరెఁ దీరె చాలుఁ జాలుఁ గర్మము
(॥ఇంక॥)
కోరి పుణ్యము లేమైనాఁ గొన్ని సేసేమంటిమా
కోరిక లిచ్చేటి హరి కూడి మాలోనున్నాఁడు
చేరఁ జోటువెదకి పొంచి తిరిగేమంటిమా
చేరేటివైకుంఠపతి చేతిలో నున్నాఁడు
(॥ఇంక॥)
భవహరముగ వేదపఠన సేసేమంటే
భవహరమగుహరిపాటలు నోట నున్నవి
తవిలి సంపదలకై దానమిచ్చేమంటిమా
భువిలోన శ్రీపతి మాపూజలో నున్నాఁడు
(॥ఇంక॥)
యిహసుఖములకుఁగా యిందరి వేఁడేమంటే
యిహమిచ్చేశ్రీవేంకటేశుఁ డెదుట నున్నాఁడు
సహజమయినయట్టిసర్వేశఁ డీతడే
మహిమలన్నియుఁ దానె మాకు నిచ్చినాఁడు
(||pallavi||)
iṁkanemi sesemu yinniḍām̐ danisidimi
saṁkĕlĕllām̐ dīrĕm̐ dīrĕ sālum̐ jālum̐ garmamu
(||iṁka||)
kori puṇyamu lemainām̐ gŏnni sesemaṁṭimā
koriga lichcheḍi hari kūḍi mālonunnām̐ḍu
seram̐ joḍuvĕdagi pŏṁchi tirigemaṁṭimā
sereḍivaiguṁṭhabadi sedilo nunnām̐ḍu
(||iṁka||)
bhavaharamuga vedabaṭhana sesemaṁṭe
bhavaharamaguharibāḍalu noḍa nunnavi
tavili saṁpadalagai dānamichchemaṁṭimā
bhuvilona śhrībadi mābūjalo nunnām̐ḍu
(||iṁka||)
yihasukhamulagum̐gā yiṁdari vem̐ḍemaṁṭe
yihamichcheśhrīveṁkaḍeśhum̐ ḍĕduḍa nunnām̐ḍu
sahajamayinayaṭṭisarveśham̐ ḍīdaḍe
mahimalanniyum̐ dānĕ māgu nichchinām̐ḍu