(॥పల్లవి॥)
ఇంకనేమి గడ మిందరికి
పొంకముగా నిటు భోగించఁగలఁడు
(॥॥)
జగడములడిచినసవతుల కెల్లా
తగవులు చెప్పఁగఁ దాఁ గలఁడు
వెగటునఁదనతో వెంగెములాడిన
మగిడి వేఁడుకొన మఱి తాఁ గలఁడు
(॥॥)
ప్రియపడి కాంతలు పెనఁగి యలసితే
దయలు దలంచఁగఁ దాఁ గలఁడు
రయమునఁ దనకై గాఁపుగ వలచిన
నయమున నవ్వుచు నమ్మించఁగలఁడు
(॥॥)
పతమై వనితలు సరిఁ బెండ్లాడిన
తతిగొని కూడఁగఁదాఁ గలఁడు
యితవై శ్రీ వేంకటేశుఁడు తానె
గతియై మమ్మేలెఁగమ్మటిఁగలఁడు
(||pallavi||)
iṁkanemi gaḍa miṁdarigi
pŏṁkamugā niḍu bhogiṁcham̐galam̐ḍu
(||||)
jagaḍamulaḍisinasavadula kĕllā
tagavulu sĕppam̐gam̐ dām̐ galam̐ḍu
vĕgaḍunam̐danado vĕṁgĕmulāḍina
magiḍi vem̐ḍugŏna maṟi tām̐ galam̐ḍu
(||||)
priyabaḍi kāṁtalu pĕnam̐gi yalaside
dayalu dalaṁcham̐gam̐ dām̐ galam̐ḍu
rayamunam̐ danagai gām̐puga valasina
nayamuna navvusu nammiṁcham̐galam̐ḍu
(||||)
padamai vanidalu sarim̐ bĕṁḍlāḍina
tadigŏni kūḍam̐gam̐dām̐ galam̐ḍu
yidavai śhrī veṁkaḍeśhum̐ḍu tānĕ
gadiyai mammelĕm̐gammaḍim̐galam̐ḍu