Imkanele(la?) ninnudoora nimtadimeemda

ఇంకనేలే(ల?) నిన్నుదూర నింతటిమీఁద
Language

(॥పల్లవి॥)
ఇంకనేలే(ల?) నిన్నుదూర నింతటిమీఁద
అంకెల నా యిచ్చకమే అమరదు గానీ

(॥ఇంక॥)
ముంచి నీతో నాడినట్టి ముచ్చటలెల్లా నాకెతో
కొంచక చెప్పితి పూసగుచ్చినట్టు
మంచివాఁడవే నీవు మతక మెరఁగనట్టి
నించిననావొల్లదే నేరమి గానీ

(॥ఇంక॥)
చేతికి నేనిచ్చినట్టిచెంగలువబంతి నాకె-
నేతులకు వేసితివి యీడనుండే
నీతి నీ వెరుఁగుదువు నేనే యిచ్చకాలు సేసి
ఘాతల నలుగనిదే కల్ల నాకుఁ గానీ

(॥ఇంక॥)
నిన్ను నేఁ గాఁగిలించఁగ నీకు నీకే ఆకెఁజూచి
కన్నులనే సన్న సేసి కదియించేవు
పన్నిన శ్రీ వేంకటేశ పంతగాఁడవౌదు నీవు
నన్నుఁ గూడితివి నీతో నవ్వితిఁ గానీ

(||pallavi||)
iṁkanele(la?) ninnudūra niṁtaḍimīm̐da
aṁkĕla nā yichchagame amaradu gānī

(||iṁka||)
muṁchi nīdo nāḍinaṭṭi muchchaḍalĕllā nāgĕdo
kŏṁchaga sĕppidi pūsaguchchinaṭṭu
maṁchivām̐ḍave nīvu madaga mĕram̐ganaṭṭi
niṁchinanāvŏllade nerami gānī

(||iṁka||)
sedigi nenichchinaṭṭisĕṁgaluvabaṁti nāgĕ-
nedulagu vesidivi yīḍanuṁḍe
nīdi nī vĕrum̐guduvu nene yichchagālu sesi
ghādala naluganide kalla nāgum̐ gānī

(||iṁka||)
ninnu nem̐ gām̐giliṁcham̐ga nīgu nīge āgĕm̐jūsi
kannulane sanna sesi kadiyiṁchevu
pannina śhrī veṁkaḍeśha paṁtagām̐ḍavaudu nīvu
nannum̐ gūḍidivi nīdo navvidim̐ gānī