ఇంకనేలే నీకుఁ జింత యెంచి చూచుకోవు గాక
(॥పల్లవి॥)
ఇంకనేలే నీకుఁ జింత యెంచి చూచుకోవు గాక
మంకుల మరుఁడు నీమనసే కాదా
(॥ఇంక॥)
చందురుఁడు నెమ్మోము చల్లువెన్నెలనే నవ్వు
అందలియమృతము నీ యధరామృతము
పొందిననీ విభునిఁ బాసి పొడవుచందురుఁ గని
ఇందులోనే కసరేవు హితుఁడు గాఁడా
(॥ఇంక॥)
మెఱుఁగుఁ దీగె నీమేను మించుఁ జిగురు చేతులు
తఱిఁ బూవుగుత్తులే తగునీచన్నులు
మెఱయ నీపతిఁ బాసి మించినతీగెలు చూచి
వెఱవనేఁటికే యివి వింతలా నీ కిపుడు
(॥ఇంక॥)
చల్లగాలి నీవూర్పు సంపంగ నీనాసికము
వెల్లిగా నిన్నిటిమీఁదా విసుగనేలే
యెల్లగా శ్రీ వేంకటేశుఁ డిదివో నిన్నుఁ గలసె
బల్లిదుఁ డితఁడే నీకుఁ బ్రాణముగాఁదా
(||pallavi||)
iṁkanele nīgum̐ jiṁta yĕṁchi sūsugovu gāga
maṁkula marum̐ḍu nīmanase kādā
(||iṁka||)
saṁdurum̐ḍu nĕmmomu salluvĕnnĕlane navvu
aṁdaliyamṛtamu nī yadharāmṛtamu
pŏṁdinanī vibhunim̐ bāsi pŏḍavusaṁdurum̐ gani
iṁdulone kasarevu hidum̐ḍu gām̐ḍā
(||iṁka||)
mĕṟum̐gum̐ dīgĕ nīmenu miṁchum̐ jiguru sedulu
taṟim̐ būvuguttule tagunīsannulu
mĕṟaya nībadim̐ bāsi miṁchinadīgĕlu sūsi
vĕṟavanem̐ṭige yivi viṁtalā nī kibuḍu
(||iṁka||)
sallagāli nīvūrbu saṁpaṁga nīnāsigamu
vĕlligā ninniḍimīm̐dā visuganele
yĕllagā śhrī veṁkaḍeśhum̐ ḍidivo ninnum̐ galasĕ
ballidum̐ ḍidam̐ḍe nīgum̐ brāṇamugām̐dā