ఇంకనేలే మొకదాకి రింతకు మిక్కిలి గద్దా
(॥పల్లవి॥)
ఇంకనేలే మొకదాకి రింతకు మిక్కిలి గద్దా
సంకె లేక మోవితేనె చవిచూడు మనవే
(॥ఇంక॥)
సొలసి చూచినతి సుద్దులెల్లాఁ జెప్పుఁ గాక
తలవంపులసిగ్గులు తన కేఁటికే
కలికితనాలు నేర్చి కడమలు వెట్టనేల
బలిమిసేసి యితనిపైఁ జూపుమనవే
(॥ఇంక॥)
విచ్చనవిడైనయాపె వేడుకలు రేఁచుఁ గాక
తచ్చనతలుపుమాఁటు తన కేఁటికే
వచ్చిదేర నవ్వి మరి పదనులు చూడనేల
నిచ్చనిచ్చా నితనిపై నిడించు మనవె
(॥ఇంక॥)
తెర దీసినదంట తెలివితోఁ గూడుఁ గాక
తరితీపుజాగులు తన కేఁటికే
యిరవై శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
తరవాతిపనులెల్లాఁ దాఁ జేయుమనవే
(||pallavi||)
iṁkanele mŏgadāgi riṁtagu mikkili gaddā
saṁkĕ lega movidenĕ savisūḍu manave
(||iṁka||)
sŏlasi sūsinadi suddulĕllām̐ jĕppum̐ gāga
talavaṁpulasiggulu tana kem̐ṭige
kaligidanālu nersi kaḍamalu vĕṭṭanela
balimisesi yidanibaim̐ jūbumanave
(||iṁka||)
vichchanaviḍainayābĕ veḍugalu rem̐sum̐ gāga
tachchanadalubumām̐ṭu tana kem̐ṭige
vachchidera navvi mari padanulu sūḍanela
nichchanichchā nidanibai niḍiṁchu manavĕ
(||iṁka||)
tĕra dīsinadaṁṭa tĕlividom̐ gūḍum̐ gāga
taridībujāgulu tana kem̐ṭige
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ
taravādibanulĕllām̐ dām̐ jeyumanave