ఇంకనేలే మరఁగులు ఇన్నియునుఁ దేటపడె
(॥పల్లవి॥)
ఇంకనేలే మరఁగులు ఇన్నియునుఁ దేటపడె
పంకించి నివ్వెరగులు పడనేలే
(॥ఇంక॥)
పొందైనయాపె సుద్దులు బొంకక చెప్పుమంటేను
అందగారిమాటలేల ఆడీనే తాను
విందమంటా నే ననేకవేడుకతో నుండఁగాను
చెంది యందరిలోఁ దాను సిగ్గులు వడుదురా
(॥ఇంక॥)
పెల్లున నాపె నిందుకుఁ బిలిపించుకుండఁగాను
చెల్లఁబో వట్టిగుట్టే సేసీనే తాను
చల్లఁగా నిద్దరిఁ జూచి సంతోసించుకొందమంటే
పల్లదానఁ దలవంచి పరాకున నుందురా
(॥ఇంక॥)
చెలరేఁగి యాపెచేత సేసలు వెట్టించగాను
నలువంకఁ జూచి యేల నవ్వీనే తాను
యెలమి శ్రీవేంకటేశుఁ డిటు తానే నన్నుఁ గూడె
వలపు పొగడఁగాను వద్దందురా
(||pallavi||)
iṁkanele maram̐gulu inniyunum̐ deḍabaḍĕ
paṁkiṁchi nivvĕragulu paḍanele
(||iṁka||)
pŏṁdainayābĕ suddulu bŏṁkaga sĕppumaṁṭenu
aṁdagārimāḍalela āḍīne tānu
viṁdamaṁṭā ne nanegaveḍugado nuṁḍam̐gānu
sĕṁdi yaṁdarilom̐ dānu siggulu vaḍudurā
(||iṁka||)
pĕlluna nābĕ niṁdugum̐ bilibiṁchuguṁḍam̐gānu
sĕllam̐bo vaṭṭiguṭṭe sesīne tānu
sallam̐gā niddarim̐ jūsi saṁtosiṁchugŏṁdamaṁṭe
palladānam̐ dalavaṁchi parāguna nuṁdurā
(||iṁka||)
sĕlarem̐gi yābĕseda sesalu vĕṭṭiṁchagānu
naluvaṁkam̐ jūsi yela navvīne tānu
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiḍu tāne nannum̐ gūḍĕ
valabu pŏgaḍam̐gānu vaddaṁdurā