ఇంకనేలే మాటలు యెఱుఁగుదు నేనన్నియు
(॥పల్లవి॥)
ఇంకనేలే మాటలు యెఱుఁగుదు నేనన్నియు
కంకిగా నీతోఁ దారుకాణించితిఁ జాలదా
(॥ఇంక॥)
సెలవి నీవు నవ్వఁగా సిగ్గువడి ఇంతి నిన్ను
కలువపూవున వేసెఁ గద్దో లేదో
నిలువుటద్దములో నీ నీడ నీవు చూచుకోఁగా
కలికి కాఁగిటఁబట్టె కద్దో లేదో
(॥ఇంక॥)
అందముగా నీవు దన్ను ఆయములు చెనకఁగా
గందము నీపైఁ బూసె కద్దో లేదో
సందడిఁ గొలువలోన సరిఁ బరాకై యుండఁగా
కందువలు నిన్ను నంటెఁ గద్దో లేదో
(॥ఇంక॥)
నిక్కి నీవు చూడఁగాను నిన్నుఁజేయివట్టి తీసి
గక్కున రతులఁ గూడె కద్దో లేదో
యిక్కడ శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
కక్కసించి జంకించెఁ గద్దో లేదో
(||pallavi||)
iṁkanele māḍalu yĕṟum̐gudu nenanniyu
kaṁkigā nīdom̐ dārugāṇiṁchidim̐ jāladā
(||iṁka||)
sĕlavi nīvu navvam̐gā sigguvaḍi iṁti ninnu
kaluvabūvuna vesĕm̐ gaddo ledo
niluvuḍaddamulo nī nīḍa nīvu sūsugom̐gā
kaligi kām̐giḍam̐baṭṭĕ kaddo ledo
(||iṁka||)
aṁdamugā nīvu dannu āyamulu sĕnagam̐gā
gaṁdamu nībaim̐ būsĕ kaddo ledo
saṁdaḍim̐ gŏluvalona sarim̐ barāgai yuṁḍam̐gā
kaṁduvalu ninnu naṁṭĕm̐ gaddo ledo
(||iṁka||)
nikki nīvu sūḍam̐gānu ninnum̐jeyivaṭṭi tīsi
gakkuna radulam̐ gūḍĕ kaddo ledo
yikkaḍa śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
kakkasiṁchi jaṁkiṁchĕm̐ gaddo ledo