ఇంకనేలే మాటలూ యింతి నీజాడ చూచితి
(॥పల్లవి॥)
ఇంకనేలే మాటలూ యింతి నీజాడ చూచితి
అంకెలఁ జల్లగాలికి నాయాలు ముట్టితిని
(॥ఇంక॥)
కప్పురము దిన్ననోటఁ గాదన నింపుగాక
వుప్పుదిన్న నోట నంటే నొడఁబాటౌనా
నెప్పున నాబుద్ది విని నీవు పతిఁ గలసేవా
విప్పుఁగోవిలనోటికి వెరచితిగాక
(॥ఇంక॥)
వుంగరపువేల సన్న లూరకనైనా నింపుగాక
సంగతి రుత్తైనవేల చవివుట్టీనా
బంగపడి మొక్కినాను పతివి దగ్గరితివా
వుంగిటిఁ జంద్రునిరాక కులికి వచ్చితివి
(॥ఇంక॥)
కాటుకవెట్టినకంటఁ గసరితే నింపుగాక
గాఁటపురుత్తకన్నులఁ గందువయ్యీనా
నాటినమరునమ్ములనంజు తలకెక్కఁగాను
కూటువ శ్రీవేంకటేశుఁ గూడితివే మగువా
(||pallavi||)
iṁkanele māḍalū yiṁti nījāḍa sūsidi
aṁkĕlam̐ jallagāligi nāyālu muṭṭidini
(||iṁka||)
kappuramu dinnanoḍam̐ gādana niṁpugāga
vuppudinna noḍa naṁṭe nŏḍam̐bāḍaunā
nĕppuna nābuddi vini nīvu padim̐ galasevā
vippum̐govilanoḍigi vĕrasidigāga
(||iṁka||)
vuṁgarabuvela sanna lūraganainā niṁpugāga
saṁgadi ruttainavela savivuṭṭīnā
baṁgabaḍi mŏkkinānu padivi daggaridivā
vuṁgiḍim̐ jaṁdrunirāga kuligi vachchidivi
(||iṁka||)
kāḍugavĕṭṭinagaṁṭam̐ gasaride niṁpugāga
gām̐ṭaburuttagannulam̐ gaṁduvayyīnā
nāḍinamarunammulanaṁju talagĕkkam̐gānu
kūḍuva śhrīveṁkaḍeśhum̐ gūḍidive maguvā