Imkanela yelavayya yimtini neevu

ఇంకనేల యేలవయ్య యింతిని నీవు
Language

(॥పల్లవి॥)
ఇంకనేల యేలవయ్య యింతిని నీవు
సంకె లేక పెనఁగఁగా సంతోసములాయను

(॥ఇంక॥)
పలుమారు నూడిగాలు బత్తితోడఁ జేయఁగాను
చెలియకు వలపులు చిమ్మిరేఁగెను
కలసి మెలసి నీకు గతులెల్లఁ జెప్పగాను
అలవోకచుట్టరిక మంటుకొనెను

(॥ఇంక॥)
సరిక బేసికి నీతోఁ జదురంగా లాడఁగాను
తరుణిమనసు నీకుఁ దగులాయను
తరితీపుతో నిన్నుఁ దప్పక చూడఁగాను
పరగ జవ్వనము నీపాలాయను

(॥ఇంక॥)
మితిమీరి నీతోను మేలము లాడఁగాను
సతిమోవి నీకు విందై చవులాయను
యితవై శ్రీ వేంకటేశ యీకె యలమేలుమంగ
సతతము కాఁగిట జంటయై నిలిచెను

(||pallavi||)
iṁkanela yelavayya yiṁtini nīvu
saṁkĕ lega pĕnam̐gam̐gā saṁtosamulāyanu

(||iṁka||)
palumāru nūḍigālu battidoḍam̐ jeyam̐gānu
sĕliyagu valabulu simmirem̐gĕnu
kalasi mĕlasi nīgu gadulĕllam̐ jĕppagānu
alavogasuṭṭariga maṁṭugŏnĕnu

(||iṁka||)
sariga besigi nīdom̐ jaduraṁgā lāḍam̐gānu
taruṇimanasu nīgum̐ dagulāyanu
taridībudo ninnum̐ dappaga sūḍam̐gānu
paraga javvanamu nībālāyanu

(||iṁka||)
midimīri nīdonu melamu lāḍam̐gānu
sadimovi nīgu viṁdai savulāyanu
yidavai śhrī veṁkaḍeśha yīgĕ yalamelumaṁga
sadatamu kām̐giḍa jaṁṭayai nilisĕnu