ఇంకనేల యీ సుద్దు లెందాఁకాను
(॥పల్లవి॥)
ఇంకనేల యీ సుద్దు లెందాఁకాను
సంకె దీరె నన్నిటాను చలివాసె నీకును
(॥ఇంక॥)
పిలిచి పెక్కుసతుల పెండ్లియాడితివంటా
చలము సాదించేనా సారెసారెకు
తెలివిఁ జెక్కుల గోరు దీఇంచుకొంటివంటా
నెలకొన్న నిను నేఁడు నేరము లెంచేనా
(॥ఇంక॥)
తచ్చక కెవ్వతెచీరో దట్టిగట్టుకొంటివంటా
మచ్చరించేనా నీతో మాటిమాటికి
మెచ్చుల కాపెసొమ్ములు మెడఁబెట్టుకొంటివంటా
తుచ్చములాడి నీపై దూరుగట్టేనా
(॥ఇంక॥)
ఆసపడి వాడవారి నట్టె చూచితివంటా
బాసగొనేనా నిన్నుఁ బలుమారును
సేసవెట్టి కూడితివి శ్రీవేంకటేశ నన్ను
చేసినసేఁతల కెల్ల సిగ్గువరచేనా
(||pallavi||)
iṁkanela yī suddu lĕṁdām̐kānu
saṁkĕ dīrĕ nanniḍānu salivāsĕ nīgunu
(||iṁka||)
pilisi pĕkkusadula pĕṁḍliyāḍidivaṁṭā
salamu sādiṁchenā sārĕsārĕgu
tĕlivim̐ jĕkkula goru dīiṁchugŏṁṭivaṁṭā
nĕlagŏnna ninu nem̐ḍu neramu lĕṁchenā
(||iṁka||)
tachchaga kĕvvadĕsīro daṭṭigaṭṭugŏṁṭivaṁṭā
machchariṁchenā nīdo māḍimāḍigi
mĕchchula kābĕsŏmmulu mĕḍam̐bĕṭṭugŏṁṭivaṁṭā
tuchchamulāḍi nībai dūrugaṭṭenā
(||iṁka||)
āsabaḍi vāḍavāri naṭṭĕ sūsidivaṁṭā
bāsagŏnenā ninnum̐ balumārunu
sesavĕṭṭi kūḍidivi śhrīveṁkaḍeśha nannu
sesinasem̐tala kĕlla sigguvarasenā