ఇంకనేల వెఱపులు యిన్నిటాను చలివాసె
(॥పల్లవి॥)
ఇంకనేల వెఱపులు యిన్నిటాను చలివాసె
సంకెలేక బొమలనే జంకించీ నిఁకనూ
(॥ఇంక॥)
సతికి మాఁటలాడఁగ చనపు లిచ్చితివి
యితవై సేవకు వేళ లిచ్చితివి
వెతదీర నాపెకు విచ్చనవిడాయ నిఁక
మితిమీర నేముందర మెరసీ నిన్నిటాను
(॥ఇంక॥)
అంగన నవ్వులు నవ్వ ఆసలు వెట్టితివి
చెంగట సలిగెలెల్లాఁ జెల్లించితివి
అంగవించినరతుల నాపె రపమాయ నిఁక
సింగారాన రాజ్యము సేసీ నీవద్దనూ
(॥ఇంక॥)
మగువ నిన్నుఁ జెనక మన్నించితివిప్పు డిట్టె
పొగరురతులఁ గూడి బోధించితివి
నిగిడి శ్రీవేంకటేశ నాఁడాపెపంతము వచ్చె
పగటునమమ్మిట్టే బతికించీ నిఁకనూ
(||pallavi||)
iṁkanela vĕṟabulu yinniḍānu salivāsĕ
saṁkĕlega bŏmalane jaṁkiṁchī nim̐kanū
(||iṁka||)
sadigi mām̐ṭalāḍam̐ga sanabu lichchidivi
yidavai sevagu veḽa lichchidivi
vĕdadīra nābĕgu vichchanaviḍāya nim̐ka
midimīra nemuṁdara mĕrasī ninniḍānu
(||iṁka||)
aṁgana navvulu navva āsalu vĕṭṭidivi
sĕṁgaḍa saligĕlĕllām̐ jĕlliṁchidivi
aṁgaviṁchinaradula nābĕ rabamāya nim̐ka
siṁgārāna rājyamu sesī nīvaddanū
(||iṁka||)
maguva ninnum̐ jĕnaga manniṁchidivippu ḍiṭṭĕ
pŏgaruradulam̐ gūḍi bodhiṁchidivi
nigiḍi śhrīveṁkaḍeśha nām̐ḍābĕbaṁtamu vachchĕ
pagaḍunamammiṭṭe badigiṁchī nim̐kanū