ఇంకనేల వెంగెమాడ నియ్యకోలైన పనికి
(॥పల్లవి॥)
ఇంకనేల వెంగెమాడ నియ్యకోలైన పనికి
సంకెలేని చనవున జట్టిగొంట గాక
(॥ఇంక॥)
చిగురుఁబెదవిమీఁద చిమ్ముచుఁ దీపులు చల్లి
మగువ నిన్నుఁజే మాటలాడఁగా
నగవచ్చునా నీతో నంటుచేసుకొని నాకు
వొఁగి బరాకులు చేసుకుండటగాక
(॥ఇంక॥)
సొలపుఁ జూపులలోన సూటిమెఱుఁగులు చల్లి
జలజాక్షి నిన్ను సారె జంకించఁగా
పిలువచ్చునా నిన్ను పెనఁగచు మాఇంటికి
కొలువులో నవ్వుచేసుకొనుటగాక
(॥ఇంక॥)
కొమరెగుబ్బలచేత గురుతులు సోఁకించి
రమణి నిన్నేకతాన రతిసేయఁగా
అమర నలమేల్మంగ నౌదును శ్రీవేంకటేశ
తమి నిన్నుఁగూడి యిట్టె దై వారుటగాక
(||pallavi||)
iṁkanela vĕṁgĕmāḍa niyyagolaina panigi
saṁkĕleni sanavuna jaṭṭigŏṁṭa gāga
(||iṁka||)
sigurum̐bĕdavimīm̐da simmusum̐ dībulu salli
maguva ninnum̐je māḍalāḍam̐gā
nagavachchunā nīdo naṁṭusesugŏni nāgu
vŏm̐gi barāgulu sesuguṁḍaḍagāga
(||iṁka||)
sŏlabum̐ jūbulalona sūḍimĕṟum̐gulu salli
jalajākṣhi ninnu sārĕ jaṁkiṁcham̐gā
piluvachchunā ninnu pĕnam̐gasu māiṁṭigi
kŏluvulo navvusesugŏnuḍagāga
(||iṁka||)
kŏmarĕgubbalaseda gurudulu som̐kiṁchi
ramaṇi ninnegadāna radiseyam̐gā
amara nalamelmaṁga naudunu śhrīveṁkaḍeśha
tami ninnum̐gūḍi yiṭṭĕ dai vāruḍagāga