ఇంకనేల వట్టిగుట్టు లెదిరించె వలపులు
(॥పల్లవి॥)
ఇంకనేల వట్టిగుట్టు లెదిరించె వలపులు
పొంకమాయ నీతనితో పొందులు చేకొనరే
(॥ఇంక॥)
చెంతనుండి రమణుఁడు చెక్కునొక్కి వేఁడుకొనీ
యెంతటిపనికైనాను యియ్యకొనవే
వింత వింతమాటలాడి వేమారును లాలించీ
సంతోసాన నందుకును సమ్మతించరే
(॥ఇంక॥)
సారె సారె వేడుకతో సన్నలు నీకుఁ జేసీ
మేరతోడ నన్నిటికి మేకొనరే
వూరడించి వూరడించి వొడఁబరచీ నిన్ను
ఆరీతి నాతనిచేఁత లంగవించరే
(॥ఇంక॥)
చెంది నిన్ను బుజ్జగించి సేసవెట్టి చనవిచ్చీ
కందువల నీవు నీట్టె కానిమ్మనవే
యిందరిలో శ్రీవేంకటేశుఁ డీతఁడే నిన్నేలె
మందలించి ఇప్పుడిట్టె మనసు చొక్కవే
(||pallavi||)
iṁkanela vaṭṭiguṭṭu lĕdiriṁchĕ valabulu
pŏṁkamāya nīdanido pŏṁdulu segŏnare
(||iṁka||)
sĕṁtanuṁḍi ramaṇum̐ḍu sĕkkunŏkki vem̐ḍugŏnī
yĕṁtaḍibanigainānu yiyyagŏnave
viṁta viṁtamāḍalāḍi vemārunu lāliṁchī
saṁtosāna naṁdugunu sammadiṁchare
(||iṁka||)
sārĕ sārĕ veḍugado sannalu nīgum̐ jesī
meradoḍa nanniḍigi megŏnare
vūraḍiṁchi vūraḍiṁchi vŏḍam̐barasī ninnu
ārīdi nādanisem̐ta laṁgaviṁchare
(||iṁka||)
sĕṁdi ninnu bujjagiṁchi sesavĕṭṭi sanavichchī
kaṁduvala nīvu nīṭṭĕ kānimmanave
yiṁdarilo śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍe ninnelĕ
maṁdaliṁchi ippuḍiṭṭĕ manasu sŏkkave