Imkanela vatti siggulimdarilona

ఇంకనేల వట్టి సిగ్గులిందరిలోన
Language

(॥పల్లవి॥)
ఇంకనేల వట్టి సిగ్గులిందరిలోన
పొంకపు రతులే కాక బూటకము వలెనా

(॥ఇంక॥)
పడఁతి నీవును నొక్కపానుపుపైఁ బవ్వళించి
యెడమాటలాడించ నిఁకనేల
వడియుఁజెమటలతో వలపులు రేఁగఁగాను
అడపక త్తెలతోడి ఆలోచన వలెనా

(॥ఇంక॥)
భామయు నీవును నొక్కపచ్చడములో నుండి
ఆముకొని చేకానుకలంపనేల
ఆమని పులకలలో నాసలు పెనగొనఁగ
దోమటిని వద్దివారితో నవ్వవలెనా

(॥ఇంక॥)
కలికి నీవును నొక్కకాఁగిటనే వుండఁగాను
పలుమారు కొత్తవొడఁబాటులేల
కలసితిరిదే శ్రీవేంకటేశ కళలు మించ
అలరి యందరిచేత అప్పణలు వలెనా

(||pallavi||)
iṁkanela vaṭṭi sigguliṁdarilona
pŏṁkabu radule kāga būḍagamu valĕnā

(||iṁka||)
paḍam̐ti nīvunu nŏkkabānububaim̐ bavvaḽiṁchi
yĕḍamāḍalāḍiṁcha nim̐kanela
vaḍiyum̐jĕmaḍalado valabulu rem̐gam̐gānu
aḍabaga ttĕladoḍi ālosana valĕnā

(||iṁka||)
bhāmayu nīvunu nŏkkabachchaḍamulo nuṁḍi
āmugŏni segānugalaṁpanela
āmani pulagalalo nāsalu pĕnagŏnam̐ga
domaḍini vaddivārido navvavalĕnā

(||iṁka||)
kaligi nīvunu nŏkkagām̐giḍane vuṁḍam̐gānu
palumāru kŏttavŏḍam̐bāḍulela
kalasidiride śhrīveṁkaḍeśha kaḽalu miṁcha
alari yaṁdariseda appaṇalu valĕnā