Imkanela tamagimche nimdugu nenu

ఇంకనేల తమకించే నిందుకు నేను
Language

(॥పల్లవి॥)
ఇంకనేల తమకించే నిందుకు నేను
సంకెలెల్లాఁ దీరెఁ జనవరి నేను

(॥ఇంక॥)
వాములుగా వలపులు వలసినవారి కిచ్చి
నామొగము చూడఁగానే నవ్వితి నేను
చేముంచె నీచేఁతలు చేరె నీవుద్దండములు
యేమని వుత్తరమిచ్చే నియ్యకొంటి నేను

(॥ఇంక॥)
వుమ్మడి నీవొక్కఁడవే వూరెల్లాఁ దిరిగివచ్చి
నమ్మికే నీవియ్యఁగానే నవ్వితి నేను
కమ్ముకొనెఁ జెమటలు కానవచ్చె గుఱుతులు
కమ్మటి నిన్ననలేక కానిమ్మంటి నేను

(॥ఇంక॥)
అన్నిటా జాణతనాల నాయములెల్లాఁ గరఁగి
నన్ను నిట్టె కూడఁగాను నవ్వితి నేను
నిన్ను శ్రీవేంకటేశుఁడ నే నలమేలుమంగను
సన్నలఁ గలసి మోవి చవిగొంటి నేను

(||pallavi||)
iṁkanela tamagiṁche niṁdugu nenu
saṁkĕlĕllām̐ dīrĕm̐ janavari nenu

(||iṁka||)
vāmulugā valabulu valasinavāri kichchi
nāmŏgamu sūḍam̐gāne navvidi nenu
semuṁchĕ nīsem̐talu serĕ nīvuddaṁḍamulu
yemani vuttaramichche niyyagŏṁṭi nenu

(||iṁka||)
vummaḍi nīvŏkkam̐ḍave vūrĕllām̐ dirigivachchi
nammige nīviyyam̐gāne navvidi nenu
kammugŏnĕm̐ jĕmaḍalu kānavachchĕ guṟudulu
kammaḍi ninnanalega kānimmaṁṭi nenu

(||iṁka||)
anniḍā jāṇadanāla nāyamulĕllām̐ garam̐gi
nannu niṭṭĕ kūḍam̐gānu navvidi nenu
ninnu śhrīveṁkaḍeśhum̐ḍa ne nalamelumaṁganu
sannalam̐ galasi movi savigŏṁṭi nenu