ఇంకనేల రావయ్య ఇన్నియుఁ జెల్లెను నీకు
(॥పల్లవి॥)
ఇంకనేల రావయ్య ఇన్నియుఁ జెల్లెను నీకు
సుంకు నీ మతకములు చూపి చెప్పఁగలనా
(॥ఇంక॥)
గొందినున్న నీమేని గురుతులు చూచేనంటే
గందము వూసినమీఁదఁ గానరాదుగా
కందువ నీమోములోనికళలు దెలిసేనంటే
సందడినవ్వులలోన చక్కఁగా నణఁగెఁగా
(॥ఇంక॥)
నిట్టూరుపులోనైన నిన్ను నేర్పరచేనంటే
జట్టిగొని నాముందర సాముసేసేవు
చిట్టకపుఁబులకలు చెక్కుల నరసేనంటే
గట్టిగా నన్నిట్టె బిగ్గఁ గాఁగిలించుకొంటివి
(॥ఇంక॥)
దిట్టనై నీకనుచూపుతేటలు దెలిసేనంటే
గుట్టున నన్ను రతులఁ గూడితి విట్టె
నెట్టన శ్రీవేంకటేశ నిన్ను నే నడిగేనంటే
రట్టడితనాల నింత రచ్చలకెక్కితివి
(||pallavi||)
iṁkanela rāvayya inniyum̐ jĕllĕnu nīgu
suṁku nī madagamulu sūbi sĕppam̐galanā
(||iṁka||)
gŏṁdinunna nīmeni gurudulu sūsenaṁṭe
gaṁdamu vūsinamīm̐dam̐ gānarādugā
kaṁduva nīmomulonigaḽalu dĕlisenaṁṭe
saṁdaḍinavvulalona sakkam̐gā naṇam̐gĕm̐gā
(||iṁka||)
niṭṭūrubulonaina ninnu nerbarasenaṁṭe
jaṭṭigŏni nāmuṁdara sāmusesevu
siṭṭagabum̐bulagalu sĕkkula narasenaṁṭe
gaṭṭigā nanniṭṭĕ biggam̐ gām̐giliṁchugŏṁṭivi
(||iṁka||)
diṭṭanai nīganusūbudeḍalu dĕlisenaṁṭe
guṭṭuna nannu radulam̐ gūḍidi viṭṭĕ
nĕṭṭana śhrīveṁkaḍeśha ninnu ne naḍigenaṁṭe
raṭṭaḍidanāla niṁta rachchalagĕkkidivi