Imkanela ninnu neraa lemcha nenu

ఇంకనేల నిన్ను నేరా లెంచ నేను
Language

(॥పల్లవి॥)
ఇంకనేల నిన్ను నేరా లెంచ నేను
కొంకుదేరి లోఁగితేను కూళతనము

(॥ఇంక॥)
మచ్చిక గలిగితేను మంచిమాఁట లాడవలె
కుచ్చితము నెరపితే కూళతనము
యిచ్చకమే వలసితే యెరవు లేకుండవలె
కొచ్చి కొచ్చి కొసరితే కూళతనము

(॥ఇంక॥)
పొందు లోన గూడితేను భోగించి చొక్కఁగవలె
గొంది నలుగఁగబోతే కూళతనము
చందములైతేసరసములాడవలెహెచ్చు
కుందులు వెదకఁబోతే కూళతనము

(॥ఇంక॥)
నెట్టనఁ గూడేవేళనేరుపు చూపఁగవలె
గుటు చేసుకుండితేను కూళతనము
ఱటుగా శ్రీవేంకటేశ యిట్టె నన్నేలితివి రా
కొట్టు లిఁకనెగ్గులంటే కూళతనము

(||pallavi||)
iṁkanela ninnu nerā lĕṁcha nenu
kŏṁkuderi lom̐gidenu kūḽadanamu

(||iṁka||)
machchiga galigidenu maṁchimām̐ṭa lāḍavalĕ
kuchchidamu nĕrabide kūḽadanamu
yichchagame valaside yĕravu leguṁḍavalĕ
kŏchchi kŏchchi kŏsaride kūḽadanamu

(||iṁka||)
pŏṁdu lona gūḍidenu bhogiṁchi sŏkkam̐gavalĕ
gŏṁdi nalugam̐gabode kūḽadanamu
saṁdamulaidesarasamulāḍavalĕhĕchchu
kuṁdulu vĕdagam̐bode kūḽadanamu

(||iṁka||)
nĕṭṭanam̐ gūḍeveḽanerubu sūbam̐gavalĕ
guḍu sesuguṁḍidenu kūḽadanamu
ṟaḍugā śhrīveṁkaḍeśha yiṭṭĕ nannelidivi rā
kŏṭṭu lim̐kanĕggulaṁṭe kūḽadanamu