ఇంకనేల నీవే ఆనతియ్యవయ్యా । నీ
(॥పల్లవి॥)
ఇంకనేల నీవే ఆనతియ్యవయ్యా । నీ-
అంకె దెలుసుకొనేను ఆనతీవయ్యా
(॥ఇంక॥)
పంతము దప్పదు నీతోఁ బలికిన మాత్రమున
యెంత లేదు వినే నాన తియ్యవయ్యా
చెంతల నీ చెప్పినట్టు సేసితే నాకేమాయ
అంతరంగమెల్ల నిట్టె ఆనతియ్యవయ్యా
(॥ఇంక॥)
వన్నె దరగదు నీ వద్ద నుంటే నేమాయ
యిన్నియు నాతో నానతియ్యవయ్యా
మన్ననకు లోనైతే మరి నాకు నేమాయ
అన్నిటా జాణవౌదువు ఆనతీవయ్యా
(॥ఇంక॥)
జవ్వనము సమయదు సారెఁ గూడితే నేమాయ
ఇవ్వలఁ జేకొంటి నానతియ్యవయ్య
రవ్వగ శ్రీ వేంకటేశ రతుల మించితి విట్టె
అవ్వలఁ దడవనని ఆనతీవయ్యా
(||pallavi||)
iṁkanela nīve ānadiyyavayyā | nī-
aṁkĕ dĕlusugŏnenu ānadīvayyā
(||iṁka||)
paṁtamu dappadu nīdom̐ baligina mātramuna
yĕṁta ledu vine nāna tiyyavayyā
sĕṁtala nī sĕppinaṭṭu seside nāgemāya
aṁtaraṁgamĕlla niṭṭĕ ānadiyyavayyā
(||iṁka||)
vannĕ daragadu nī vadda nuṁṭe nemāya
yinniyu nādo nānadiyyavayyā
mannanagu lonaide mari nāgu nemāya
anniḍā jāṇavauduvu ānadīvayyā
(||iṁka||)
javvanamu samayadu sārĕm̐ gūḍide nemāya
ivvalam̐ jegŏṁṭi nānadiyyavayya
ravvaga śhrī veṁkaḍeśha radula miṁchidi viṭṭĕ
avvalam̐ daḍavanani ānadīvayyā