Imkanela moramgu yidivo nivveragu

ఇంకనేల మొరఁగు యిదివో నివ్వెరగు
Language

(॥పల్లవి॥)
ఇంకనేల మొరఁగు యిదివో నివ్వెరగు
వుంకువ నేనన్నమాట కుత్తరమీవేఁటికే

(॥ఇంక॥)
చిత్తమెల్లఁ జిగిరించె చెలి నీజవ్వనమున
అత్తిననవ్వులు పువ్వు లవి యెన్నఁడే
కొత్తగాఁ గాఁకర గాచె గోరికొనతాఁకులెల్ల
యెత్తి చన్నులనిమ్మపండ్లెక్కడ దాఁచితివె

(॥ఇంక॥)
కురులచీఁకట్లవె కొంతగొంత సమకూడె
అరచందురులపొడ పది యేడదే
విరివై సిగ్గులఁ గడువెన్నెలలు గాసికాసి
తిరమై కెంపుఁగన్నుల తెల్లవారెఁగదవె

(॥ఇంక॥)
చెమట వాన గురిసి చిత్తడి యేరులువారె
తమకాన వెలిచేటితతి యెప్పుడె
తమి శ్రీవేంకటపతి తగ నిన్నేలుటఁ గంటి
గుమురుఁబులకలేల కొంగునఁ గప్పేవే

(||pallavi||)
iṁkanela mŏram̐gu yidivo nivvĕragu
vuṁkuva nenannamāḍa kuttaramīvem̐ṭige

(||iṁka||)
sittamĕllam̐ jigiriṁchĕ sĕli nījavvanamuna
attinanavvulu puvvu lavi yĕnnam̐ḍe
kŏttagām̐ gām̐kara gāsĕ gorigŏnadām̐kulĕlla
yĕtti sannulanimmabaṁḍlĕkkaḍa dām̐sidivĕ

(||iṁka||)
kurulasīm̐kaṭlavĕ kŏṁtagŏṁta samagūḍĕ
arasaṁdurulabŏḍa padi yeḍade
virivai siggulam̐ gaḍuvĕnnĕlalu gāsigāsi
tiramai kĕṁpum̐gannula tĕllavārĕm̐gadavĕ

(||iṁka||)
sĕmaḍa vāna gurisi sittaḍi yeruluvārĕ
tamagāna vĕliseḍidadi yĕppuḍĕ
tami śhrīveṁkaḍabadi taga ninneluḍam̐ gaṁṭi
gumurum̐bulagalela kŏṁgunam̐ gappeve