ఇంకనేల మఱఁగులు నింద రెఱిఁగినందుకు
(॥పల్లవి॥)
ఇంకనేల మఱఁగులు నింద రెఱిఁగినందుకు
సంకెదీరఁ గాఁగిలించీ చనవియ్యరాదా
(॥ఇంక॥)
చొప్పులెత్తి నీమోము చూచి చెలి మాటలాడీ
యిప్పుడు మారుత్తరము లియ్యరాదా
దప్పిదేరేమోవితోడఁ దారుకాణించీ నీకు
వొప్పుగ నీవాపె నిట్టె వొడఁబరచరాదా
(॥ఇంక॥)
నెలకొన్ననీమేని పైనె గురుతులు చూపీ
మెలుపున సంతోసించి మెచ్చఁగరాదా
అలరుచు నీవలపు లక్కునఁ బోసీ చూపీ
చెలరేఁ గాపెపంతము చెల్లించరాదా
(॥ఇంక॥)
మనసిచ్చి యలమేలుమంగ నీచేఁతలు మెచ్చీ
ననిచి శ్రీవేంకటేశ నవ్వఁగరాదా
యేనసి నీకీరితి ఇంపులతోఁ దమిరేఁచీ
పెనఁగి యాపెతో నిట్టే ప్రియమందరాదా
(||pallavi||)
iṁkanela maṟam̐gulu niṁda rĕṟim̐ginaṁdugu
saṁkĕdīram̐ gām̐giliṁchī sanaviyyarādā
(||iṁka||)
sŏppulĕtti nīmomu sūsi sĕli māḍalāḍī
yippuḍu māruttaramu liyyarādā
dappideremovidoḍam̐ dārugāṇiṁchī nīgu
vŏppuga nīvābĕ niṭṭĕ vŏḍam̐barasarādā
(||iṁka||)
nĕlagŏnnanīmeni painĕ gurudulu sūbī
mĕlubuna saṁtosiṁchi mĕchcham̐garādā
alarusu nīvalabu lakkunam̐ bosī sūbī
sĕlarem̐ gābĕbaṁtamu sĕlliṁcharādā
(||iṁka||)
manasichchi yalamelumaṁga nīsem̐talu mĕchchī
nanisi śhrīveṁkaḍeśha navvam̐garādā
yenasi nīgīridi iṁpuladom̐ damirem̐sī
pĕnam̐gi yābĕdo niṭṭe priyamaṁdarādā