ఇంకనేల మఱఁగూ యిందరు నెఱిఁగిరి
(॥పల్లవి॥)
ఇంకనేల మఱఁగూ యిందరు నెఱిఁగిరి
సంకెదీర నీ మోవి చవిగొంటిమి
(॥ఇంక॥)
సొరిది నీసుద్దులకే చొక్కి చొక్కి నేమెల్ల
వరుసలు వెట్టుకొని వలచితిమి
సిరులఁ గొలనిదరిని చీరలకొరకుఁగాను
వెరవుతోడ నిన్ను వేఁడుకొంటిమి
(॥ఇంక॥)
చల్లలమ్మేచోటనెల్ల జాణతనాలాడి యాడి
లొల్లిగా నీపోఁగులకు లోనయితిమి
కొల్లలాడిన వెన్నల గొందుల సందుల నెల్ల
పెల్లు రేఁగి నీకాఁగిటఁ బెనఁగితిమి
(॥ఇంక॥)
యమునలో పిల్లఁగోవి యరసేరాగాలు విని
గుమిగట్టి వచ్చి నిన్నుఁ గూడితిమి
తమితో శ్రీవేంకటేశ తలఁపు నీపైఁ బెట్టి
సమరతుల మెప్పించి చనవు చేకొంటిమి
(||pallavi||)
iṁkanela maṟam̐gū yiṁdaru nĕṟim̐giri
saṁkĕdīra nī movi savigŏṁṭimi
(||iṁka||)
sŏridi nīsuddulage sŏkki sŏkki nemĕlla
varusalu vĕṭṭugŏni valasidimi
sirulam̐ gŏlanidarini sīralagŏragum̐gānu
vĕravudoḍa ninnu vem̐ḍugŏṁṭimi
(||iṁka||)
sallalammesoḍanĕlla jāṇadanālāḍi yāḍi
lŏlligā nībom̐gulagu lonayidimi
kŏllalāḍina vĕnnala gŏṁdula saṁdula nĕlla
pĕllu rem̐gi nīgām̐giḍam̐ bĕnam̐gidimi
(||iṁka||)
yamunalo pillam̐govi yaraserāgālu vini
gumigaṭṭi vachchi ninnum̐ gūḍidimi
tamido śhrīveṁkaḍeśha talam̐pu nībaim̐ bĕṭṭi
samaradula mĕppiṁchi sanavu segŏṁṭimi