(॥పల్లవి॥)
ఇంకనేల మారుమాట లింతితోను
లంకె చేసుకొనె చెలి లావులకే పెనఁగి
(॥॥)
మాటల తేనెలతీపు మరిగి నిన్నుఁ
గాటుల కన్నులఁ జూచీ కలికి
పాటించి నీనవ్వులకే భ్రమసి అట్టె
నాటించె గుబ్బల నిన్ను ననుపుతోఁగదిసి
(॥॥)
తత్తరాన నీమన్నన దలఁచి
హత్తి చేతులెత్తి మొక్కీ నతివ
వొత్తిన నీ కొనగోరి కులికి
గుత్తపు నీకొంగువట్టె కొంత గొంత కరఁగి
(॥॥)
తెల్లమి నీరతులెల్లాఁ దెలిసి
వుల్లము నీకొప్పగించె నువిద
కొల్లగా శ్రీవేంకటేశ కూడితివి యీకె
పల్లదాన నిన్నుఁగూడె బాసగొనెఁ గొసరి
(||pallavi||)
iṁkanela mārumāḍa liṁtidonu
laṁkĕ sesugŏnĕ sĕli lāvulage pĕnam̐gi
(||||)
māḍala tenĕladību marigi ninnum̐
gāḍula kannulam̐ jūsī kaligi
pāḍiṁchi nīnavvulage bhramasi aṭṭĕ
nāḍiṁchĕ gubbala ninnu nanubudom̐gadisi
(||||)
tattarāna nīmannana dalam̐si
hatti sedulĕtti mŏkkī nadiva
vŏttina nī kŏnagori kuligi
guttabu nīgŏṁguvaṭṭĕ kŏṁta gŏṁta karam̐gi
(||||)
tĕllami nīradulĕllām̐ dĕlisi
vullamu nīgŏppagiṁchĕ nuvida
kŏllagā śhrīveṁkaḍeśha kūḍidivi yīgĕ
palladāna ninnum̐gūḍĕ bāsagŏnĕm̐ gŏsari