ఇంకనేల కొసరూ యిన్నిపనులను నాయ
(॥పల్లవి॥)
ఇంకనేల కొసరూ యిన్నిపనులను నాయ
పొంకమైతి రిన్నిటాను పొరలెల్లాఁ బాసె
(॥ఇంక॥)
యీవల నింటిలోన మిమ్మిద్దరినిఁ బొడగని
వేవేగ మామతిలోని వెఱపు వాసె
చేవలుమీరినమీకు చేతులారా వద్దనుండి
సేవలెల్లాఁ జేయఁగాను సిబ్బితి వాసె
(॥ఇంక॥)
ననుపున నిద్దరూను నవ్వు లిట్టె నవ్వఁగాను
పనివడి తొల్లిటికోపమూఁ బాసె
పెనఁగుచు నొండొరులు ప్రియములు నటించఁగా
జయమంది తిట్లాడేచలమెల్లఁ బాసె
(॥ఇంక॥)
అలమేల్మంగ నురమందు నీవెక్కించుకోఁగా
మొలచినయను మానములెల్లఁ బాసె
యెలమి శ్రీవేంకటేశ ఇద్దరూ మమ్మేలఁగాను
నెలకొంటి మిఁకను మానేరమెల్లఁ బాసె
(||pallavi||)
iṁkanela kŏsarū yinnibanulanu nāya
pŏṁkamaidi rinniḍānu pŏralĕllām̐ bāsĕ
(||iṁka||)
yīvala niṁṭilona mimmiddarinim̐ bŏḍagani
vevega māmadiloni vĕṟabu vāsĕ
sevalumīrinamīgu sedulārā vaddanuṁḍi
sevalĕllām̐ jeyam̐gānu sibbidi vāsĕ
(||iṁka||)
nanubuna niddarūnu navvu liṭṭĕ navvam̐gānu
panivaḍi tŏlliḍigobamūm̐ bāsĕ
pĕnam̐gusu nŏṁḍŏrulu priyamulu naḍiṁcham̐gā
jayamaṁdi tiṭlāḍesalamĕllam̐ bāsĕ
(||iṁka||)
alamelmaṁga nuramaṁdu nīvĕkkiṁchugom̐gā
mŏlasinayanu mānamulĕllam̐ bāsĕ
yĕlami śhrīveṁkaḍeśha iddarū mammelam̐gānu
nĕlagŏṁṭi mim̐kanu māneramĕllam̐ bāsĕ