Imkanela komkanu yinniyum jellubadaaya

ఇంకనేల కొంకను యిన్నియుఁ జెల్లుబడాయ
Language

(॥పల్లవి॥)
ఇంకనేల కొంకను యిన్నియుఁ జెల్లుబడాయ
అంకెకు వచ్చిన పని ఆపె దానే యెరుఁగు

(॥॥)
మోహముగలవాడవు మొక్కించుకో ఆపెచేత
పోహణించి నన్నేమి బుద్దెడిగేవు
సాహసివని పొగడి సాము సేయు మాపెతోడ
బాహుమూలములఁ గలపస తానే యెరుఁగు

(॥॥)
పొందుసేసినవాఁడవు పొత్తున నాకెఁ బెట్టుకో
విందువలె నాతోనేల విచారించేవు
అందరిలో సంతోసించి ఆపెనే నీవడుగుము
మందలించి నీ వాడేటిమాటలు దానెరుఁగు

(॥॥)
పెండిలాడినవాఁడవు పిలువు నీవే యాపెను
అండనే నాతోనేమి ఆలోచించేవు
నిండుక శ్రీ వేంకటేశ నీవు నన్ను నేలితివి
పండుమోవిగురుతులభావము దా నెరుఁగు

(||pallavi||)
iṁkanela kŏṁkanu yinniyum̐ jĕllubaḍāya
aṁkĕgu vachchina pani ābĕ dāne yĕrum̐gu

(||||)
mohamugalavāḍavu mŏkkiṁchugo ābĕseda
pohaṇiṁchi nannemi buddĕḍigevu
sāhasivani pŏgaḍi sāmu seyu mābĕdoḍa
bāhumūlamulam̐ galabasa tāne yĕrum̐gu

(||||)
pŏṁdusesinavām̐ḍavu pŏttuna nāgĕm̐ bĕṭṭugo
viṁduvalĕ nādonela visāriṁchevu
aṁdarilo saṁtosiṁchi ābĕne nīvaḍugumu
maṁdaliṁchi nī vāḍeḍimāḍalu dānĕrum̐gu

(||||)
pĕṁḍilāḍinavām̐ḍavu piluvu nīve yābĕnu
aṁḍane nādonemi ālosiṁchevu
niṁḍuga śhrī veṁkaḍeśha nīvu nannu nelidivi
paṁḍumovigurudulabhāvamu dā nĕrum̐gu