Imkanela daamsevu yeṟimgina panulagu

ఇంకనేల దాఁచేవు యెఱిఁగిన పనులకు
Language

(॥పల్లవి॥)
ఇంకనేల దాఁచేవు యెఱిఁగిన పనులకు
కంకియైన నీమేననే కంటిమి నే మిపుడు

(॥ఇంక॥)
మంతనాన నీవు నాకె మాటలాడుకొంటిరట
అంతలోఁబూవులవేట్లాడితిరట
సంతములన్నియు మీలోఁ బచరించుకొంటిరట
వింతలు మీసుద్దులెల్లా వింటిమి నే మిపుడు

(॥ఇంక॥)
నటనల నిద్దరును నవ్వులు నవ్వితిరట
గుటుకలు మోవులఁ జేకొంటిరట
తటుకన కిందమీఁదట లాడితిరట
విటతనములు మీవి వింటిమి లే(నే?) మిపుడు

(॥ఇంక॥)
మొక్కుచును మీరు మోములు చూచుకొంటిరట
ఇక్కురతులఁ గూడి యేలితిరట
గక్కన శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను
వెక్కసపు మీలాగులు వింటిమి నే మిపుడు

(||pallavi||)
iṁkanela dām̐sevu yĕṟim̐gina panulagu
kaṁkiyaina nīmenane kaṁṭimi ne mibuḍu

(||iṁka||)
maṁtanāna nīvu nāgĕ māḍalāḍugŏṁṭiraḍa
aṁtalom̐būvulaveṭlāḍidiraḍa
saṁtamulanniyu mīlom̐ basariṁchugŏṁṭiraḍa
viṁtalu mīsuddulĕllā viṁṭimi ne mibuḍu

(||iṁka||)
naḍanala niddarunu navvulu navvidiraḍa
guḍugalu movulam̐ jegŏṁṭiraḍa
taḍugana kiṁdamīm̐daḍa lāḍidiraḍa
viḍadanamulu mīvi viṁṭimi le(ne?) mibuḍu

(||iṁka||)
mŏkkusunu mīru momulu sūsugŏṁṭiraḍa
ikkuradulam̐ gūḍi yelidiraḍa
gakkana śhrīveṁkaḍeśha kalasidi viḍu nannu
vĕkkasabu mīlāgulu viṁṭimi ne mibuḍu