Imkanela daamseve yerimgina panulagu

ఇంకనేల దాఁచేవే యెరిఁగిన పనులకు
Language

(॥పల్లవి॥)
ఇంకనేల దాఁచేవే యెరిఁగిన పనులకు
పొంకపు సంతోసాలఁ బొదలేమే నేము

(॥ఇంక॥)
సెలవుల నవ్వుదేరెఁ జెక్కులఁ జెమటగారె
తెలిగన్నులచూపులనుఁ దెల్లవారెను
వులివచ్చి మోవితేనె లువ్వుచు నువ్విళ్ళూరె
మలసి నీపతి నీతో మాఁటాడె నటవే

(॥ఇంక॥)
అట్టె తురుము వీడె నంగమెల్లా వసివాడె
దట్టపు సిగ్గులెల్లానుఁ దలకూడెను
రెట్టించి నిద్దురలదె రెప్పలనె యల్లాడె
లెట్టన నీరమణుఁడు నిన్నేలెనటవే

(॥ఇంక॥)
నీమైగురుతులు నిండె నిలువు నూరువండె
ఆము కాతనిసొమ్ము నీకమరుండెను
యేమి నోము నోఁచితివో యిదివో నీపక్కఁబండె
ప్రేమ శ్రీవేంకటేశుఁడు పెండ్లాడెనటవే

(||pallavi||)
iṁkanela dām̐seve yĕrim̐gina panulagu
pŏṁkabu saṁtosālam̐ bŏdaleme nemu

(||iṁka||)
sĕlavula navvuderĕm̐ jĕkkulam̐ jĕmaḍagārĕ
tĕligannulasūbulanum̐ dĕllavārĕnu
vulivachchi movidenĕ luvvusu nuvviḽḽūrĕ
malasi nībadi nīdo mām̐ṭāḍĕ naḍave

(||iṁka||)
aṭṭĕ turumu vīḍĕ naṁgamĕllā vasivāḍĕ
daṭṭabu siggulĕllānum̐ dalagūḍĕnu
rĕṭṭiṁchi nidduraladĕ rĕppalanĕ yallāḍĕ
lĕṭṭana nīramaṇum̐ḍu ninnelĕnaḍave

(||iṁka||)
nīmaigurudulu niṁḍĕ niluvu nūruvaṁḍĕ
āmu kādanisŏmmu nīgamaruṁḍĕnu
yemi nomu nom̐sidivo yidivo nībakkam̐baṁḍĕ
prema śhrīveṁkaḍeśhum̐ḍu pĕṁḍlāḍĕnaḍave