Imkanela bomkanoo iddaramum goodidimi

ఇంకనేల బొంకనూ ఇద్దరముఁ గూడితిమి
Language

(॥పల్లవి॥)
ఇంకనేల బొంకనూ ఇద్దరముఁ గూడితిమి
పొంకముగ నానతిమ్మా పూఁచి నవ్వే నేను

(॥ఇంక॥)
ఆసలురేఁచుక పోయి ఆకెమీఁద వేడుకతో
సేసలు వెట్టితివా చెలరేఁగి
వేసరక నమ్మించి వేగినంతాఁ దమకించి
బాసలు సేసితివా పలుమారును

(॥ఇంక॥)
చిక్కనినవ్వుతోడ సిగ్గులెల్లాఁ బెడఁబాయ
చెక్కులు నొక్కితివా సేదలుదేర
లక్కవలెఁ గరఁగఁగ లలనతో దూరుతాను
మొక్కులు మొక్కితివా ముచ్చట దీరఁగను

(॥ఇంక॥)
వలపులు చల్లి చల్లి వంతులు వాసులెంచక
అలుకదేర్చితివా ఆపెను నీవు
యెలమి శ్రీవేంకటేన యిటు నన్నుఁ గూడితివి
అలరీ యీసుద్దు లాడ నాడుకొంటివా

(||pallavi||)
iṁkanela bŏṁkanū iddaramum̐ gūḍidimi
pŏṁkamuga nānadimmā pūm̐si navve nenu

(||iṁka||)
āsalurem̐suga poyi āgĕmīm̐da veḍugado
sesalu vĕṭṭidivā sĕlarem̐gi
vesaraga nammiṁchi veginaṁtām̐ damagiṁchi
bāsalu sesidivā palumārunu

(||iṁka||)
sikkaninavvudoḍa siggulĕllām̐ bĕḍam̐bāya
sĕkkulu nŏkkidivā sedaludera
lakkavalĕm̐ garam̐gam̐ga lalanado dūrudānu
mŏkkulu mŏkkidivā muchchaḍa dīram̐ganu

(||iṁka||)
valabulu salli salli vaṁtulu vāsulĕṁchaga
alugadersidivā ābĕnu nīvu
yĕlami śhrīveṁkaḍena yiḍu nannum̐ gūḍidivi
alarī yīsuddu lāḍa nāḍugŏṁṭivā