Imkanela aa suddulinniyu maṟasidini

ఇంకనేల ఆ సుద్దులిన్నియు మఱచితిని
Language

(॥పల్లవి॥)
ఇంకనేల ఆ సుద్దులిన్నియు మఱచితిని
బొంకఁబోతె నీ మాటఁలు పొంకమయ్యీనా

(॥ఇంక॥)
మిక్కిలి మేలువాఁడవై మించి నాతోఁ గూడుండగ
గుక్కుచు నందాలు సేసుకొంటిఁ గాక
చిక్కించి నీవు దొల్లి సేసినచేఁతల కెల్ల
తొక్కి ని న్నేమి సేసినా దోసమున్నదా

(॥ఇంక॥)
బంటువలె నీవు నాకు పనులు సేయఁగాను
కంటకము లేమి గల్లాఁ గప్పితిఁగాక
గెంటి నీ విన్నాళ్ళు దిరిగిన తిమ్మటలకును
దంటినై నిన్ను దిట్టినాఁదప్పు మోచీనా

(॥ఇంక॥)
మగఁడవై నీవు నన్ను మన్నించి కూడగను
జిగి నీకు బుద్దు లెల్లఁ జెప్పితిఁ గాక
నిగిడి శ్రీ వేంకటేశ నిన్న మొన్నటి రతికి
జగడ మెంతవెట్టినా సడి వచ్చీనా

(||pallavi||)
iṁkanela ā suddulinniyu maṟasidini
bŏṁkam̐bodĕ nī māḍam̐lu pŏṁkamayyīnā

(||iṁka||)
mikkili meluvām̐ḍavai miṁchi nādom̐ gūḍuṁḍaga
gukkusu naṁdālu sesugŏṁṭim̐ gāga
sikkiṁchi nīvu dŏlli sesinasem̐tala kĕlla
tŏkki ni nnemi sesinā dosamunnadā

(||iṁka||)
baṁṭuvalĕ nīvu nāgu panulu seyam̐gānu
kaṁṭagamu lemi gallām̐ gappidim̐gāga
gĕṁṭi nī vinnāḽḽu dirigina timmaḍalagunu
daṁṭinai ninnu diṭṭinām̐dappu mosīnā

(||iṁka||)
magam̐ḍavai nīvu nannu manniṁchi kūḍaganu
jigi nīgu buddu lĕllam̐ jĕppidim̐ gāga
nigiḍi śhrī veṁkaḍeśha ninna mŏnnaḍi radigi
jagaḍa mĕṁtavĕṭṭinā saḍi vachchīnā