Imkaneda suddulu yeederidi vinnidaanu

ఇంకనేడ సుద్దులు యీడేరితి విన్నిటాను
Language

(॥పల్లవి॥)
ఇంకనేడ సుద్దులు యీడేరితి విన్నిటాను
వంకలొత్తఁ బోతేను వంగుదువా సూటికి

(॥ఇంక॥)
చన్నుల కాఁకల నొత్తి చలివాపె నీకు నాపె
యెన్నికలు మీరి సేయకిఁక లోఁగేవా
నిన్న మొన్నటివారము నేఁడు మాకు వెఱచేవా
కన్నుల జంకించిన మాకల్ల ఇంతేకాక

(॥ఇంక॥)
కందువ చేఁతల మోవి కాయలు గాపించె నాపె
గొంది మోవిపండ్ల చవులు కోరకుండేవా
మందలించి కన్నెలము మా దిద్దుబడి వచ్చేవా
సందడించి పోరేటి మాసట లింతే కాక

(॥ఇంక॥)
కలసిన రతులచే కళలు రేఁగించె నాపె
పలుమారు మాతో సాము బడలించీనా
కులికి శ్రీ వేంకటేశ కూడితివి నీవారము
అలమి పాయనిమాలో నాస లింతేకాక

(||pallavi||)
iṁkaneḍa suddulu yīḍeridi vinniḍānu
vaṁkalŏttam̐ bodenu vaṁguduvā sūḍigi

(||iṁka||)
sannula kām̐kala nŏtti salivābĕ nīgu nābĕ
yĕnnigalu mīri seyagim̐ka lom̐gevā
ninna mŏnnaḍivāramu nem̐ḍu māgu vĕṟasevā
kannula jaṁkiṁchina māgalla iṁtegāga

(||iṁka||)
kaṁduva sem̐tala movi kāyalu gābiṁchĕ nābĕ
gŏṁdi movibaṁḍla savulu koraguṁḍevā
maṁdaliṁchi kannĕlamu mā diddubaḍi vachchevā
saṁdaḍiṁchi poreḍi māsaḍa liṁte kāga

(||iṁka||)
kalasina radulase kaḽalu rem̐giṁchĕ nābĕ
palumāru mādo sāmu baḍaliṁchīnā
kuligi śhrī veṁkaḍeśha kūḍidivi nīvāramu
alami pāyanimālo nāsa liṁtegāga