Imkanainam garimchavemayya shree

ఇంకనైనఁ గరించవేమయ్య శ్రీ
Language

(॥పల్లవి॥)
ఇంకనైనఁ గరించవేమయ్య శ్రీ-
వేంకటేశ మా ఇంటికి విచ్చేయవయ్యా

(॥ఇంక॥)
చింతజలధి దాఁటఁ జెక్కుచేయి తేపసేసి
కాంత నీ కెదురుచూచీఁ గదవయ్యా
కొంతపుఁ గోరికలనే కొండవాఁకఁ దనజడ
ఇంతలో నిచ్చనసేసీ నిది చూడవయ్యా

(॥ఇంక॥)
వెడ చింతచీఁకటికి వెలుగుగా నిట్టచూపు
కడఁగి పంజువట్టె రాఁగదవయ్య
అడరి తమకమనేఅడవి దాఁట నిదెనిట్టూర్పు
యెడ గుఱ్ఱముగఁ జేసి యెక్క నిదె కోవయ్యా

(॥ఇంక॥)
మదనానలం బార్చ మంతనానఁ జెమటల
నదులు వరపి నిన్ను నవ్వెనయ్య
యిదివో శ్రీ వేంకటేశ యింతలోఁ గూడగ నిన్ను
మదిరాక్షి నీపొందు మరవలేదయ్యా

(||pallavi||)
iṁkanainam̐ gariṁchavemayya śhrī-
veṁkaḍeśha mā iṁṭigi vichcheyavayyā

(||iṁka||)
siṁtajaladhi dām̐ṭam̐ jĕkkuseyi tebasesi
kāṁta nī kĕdurusūsīm̐ gadavayyā
kŏṁtabum̐ gorigalane kŏṁḍavām̐kam̐ danajaḍa
iṁtalo nichchanasesī nidi sūḍavayyā

(||iṁka||)
vĕḍa siṁtasīm̐kaḍigi vĕlugugā niṭṭasūbu
kaḍam̐gi paṁjuvaṭṭĕ rām̐gadavayya
aḍari tamagamaneaḍavi dām̐ṭa nidĕniṭṭūrbu
yĕḍa guṭramugam̐ jesi yĕkka nidĕ kovayyā

(||iṁka||)
madanānalaṁ bārsa maṁtanānam̐ jĕmaḍala
nadulu varabi ninnu navvĕnayya
yidivo śhrī veṁkaḍeśha yiṁtalom̐ gūḍaga ninnu
madirākṣhi nībŏṁdu maravaledayyā