ఇంకనైనా వుపదేశమిప్పించుకో యాపెచే
(॥పల్లవి॥)
ఇంకనైనా వుపదేశమిప్పించుకో యాపెచే
సంకెలేక యిటువలె సటకాఁడవైతవి
(॥ఇంక॥)
వెలలేని మాఁటలెల్లా వేసరక నీవాడఁగ
సొలసి వేరొక్కతెకుఁ జూపీఁ జెలి
నెలకొని యాకెవలె నేరవైతివి మోనము
కలకాలమును నిట్టె కతకారివైతివి
(॥ఇంక॥)
పచ్చిదేర నూరఁగలపనులెల్లా జేయఁగాను
చెచ్చెర నవ్వల సన్నసేసీఁ జెలి
కొచ్చి నీవు నట్లానే గుట్టున నుండవైతివి
వచ్చి నేడు నీవుఁ గావడివాఁడవైతివి
(॥ఇంక॥)
కన్నచుట్టాలనెల్లాను కాగిలించుకొనఁగాను
మిన్నక యెక్కడనైనా మెచ్చీఁ జెలి
అన్నిటా శ్రీవేంకటేశ యలమేలుమంగ నేను
నన్నుఁ గూడితివి యిట్టె నాటకుఁడవైతివి
(||pallavi||)
iṁkanainā vubadeśhamippiṁchugo yābĕse
saṁkĕlega yiḍuvalĕ saḍagām̐ḍavaidavi
(||iṁka||)
vĕlaleni mām̐ṭalĕllā vesaraga nīvāḍam̐ga
sŏlasi verŏkkadĕgum̐ jūbīm̐ jĕli
nĕlagŏni yāgĕvalĕ neravaidivi monamu
kalagālamunu niṭṭĕ kadagārivaidivi
(||iṁka||)
pachchidera nūram̐galabanulĕllā jeyam̐gānu
sĕchchĕra navvala sannasesīm̐ jĕli
kŏchchi nīvu naṭlāne guṭṭuna nuṁḍavaidivi
vachchi neḍu nīvum̐ gāvaḍivām̐ḍavaidivi
(||iṁka||)
kannasuṭṭālanĕllānu kāgiliṁchugŏnam̐gānu
minnaga yĕkkaḍanainā mĕchchīm̐ jĕli
anniḍā śhrīveṁkaḍeśha yalamelumaṁga nenu
nannum̐ gūḍidivi yiṭṭĕ nāḍagum̐ḍavaidivi