Imkanainaa vemdugo nee imtini neevu

ఇంకనైనా వేఁడుకో నీ ఇంతిని నీవు
Language

(॥పల్లవి॥)
ఇంకనైనా వేఁడుకో నీ ఇంతిని నీవు
సంకె దేరుతురు గాక సాము సేతురా

(॥ఇంక॥)
చేరి చన్నులంటఁగాను సిగ్గువడ్డ యాఁటదాని
గారవించవలెఁ గాక గద్దింతురా
తేరకొనఁ జూడఁగాను తెరవేసుకొన్నదాని
సారె బుజ్జగింతు గాక సాదింతురా

(॥ఇంక॥)
కొప్పు వట్టి తియ్యఁగాను కొంకినట్టి యాఁటదాని
దప్పి దేరుతురు గాక తమకింతురా
ముప్పిరిఁ జెనకఁగాను మొక్కుచున్నయట్టిదాని
దుప్పిటి గప్పుటగాక దొమ్మి సేతురా

(॥ఇంక॥)
కైవసమై కూడఁగాను కడుఁ జొక్కినాఁటదాని
మోవి యానుదురుగాక మొక్కింతురా
శ్రీవేంకటేశుఁడ వదే చెలి యలమేల్మంగ
దేవులౌటెంచేది కాక కావరింతురా

(||pallavi||)
iṁkanainā vem̐ḍugo nī iṁtini nīvu
saṁkĕ deruduru gāga sāmu sedurā

(||iṁka||)
seri sannulaṁṭam̐gānu sigguvaḍḍa yām̐ṭadāni
gāraviṁchavalĕm̐ gāga gaddiṁturā
teragŏnam̐ jūḍam̐gānu tĕravesugŏnnadāni
sārĕ bujjagiṁtu gāga sādiṁturā

(||iṁka||)
kŏppu vaṭṭi tiyyam̐gānu kŏṁkinaṭṭi yām̐ṭadāni
dappi deruduru gāga tamagiṁturā
muppirim̐ jĕnagam̐gānu mŏkkusunnayaṭṭidāni
duppiḍi gappuḍagāga dŏmmi sedurā

(||iṁka||)
kaivasamai kūḍam̐gānu kaḍum̐ jŏkkinām̐ṭadāni
movi yānudurugāga mŏkkiṁturā
śhrīveṁkaḍeśhum̐ḍa vade sĕli yalamelmaṁga
devulauḍĕṁchedi kāga kāvariṁturā