ఇంకనైనా రమ్మనవే యిట్టే తాను
(॥పల్లవి॥)
ఇంకనైనా రమ్మనవే యిట్టే తాను
అంకెలఁ బొందైనచోట నంతేలే తాను
(॥ఇంక॥)
కన్నులఁ జూచినచూపు కలువరేకై తాఁకె
యెన్న నది మరుబాణ మెఱఁగఁడా తాను
సన్న సేసినట్టిచేయి జలజలమై మీఁదఁబారె
మున్నిటి యమ్మకుఁ దోడు ముంచీనా తాను
(॥ఇంక॥)
మచ్చిక నవ్విననవ్వు మామిడిపువ్వయి తాఁకె
ఇచ్చఁ జిత్తజునమ్మౌత ఎఱఁగఁడా తాను
అచ్చపు బొమ్మజంకెన లశోకమై తాఁకె
కొచ్చి మరియు నంపె పైకొసరా తాను
(॥ఇంక॥)
కప్పురము వంటిమాట కమ్మని జాజై తాఁకె
యెప్పుడు పంచబాణాల నెఱఁగఁడా తాను
ఇప్పుడే శ్రీ వేంకటేశుఁ డేఁగివచ్చి నన్నుఁ గూడె
కప్పి కానివి మంచివికాఁ జేసె తాను
(||pallavi||)
iṁkanainā rammanave yiṭṭe tānu
aṁkĕlam̐ bŏṁdainasoḍa naṁtele tānu
(||iṁka||)
kannulam̐ jūsinasūbu kaluvaregai tām̐kĕ
yĕnna nadi marubāṇa mĕṟam̐gam̐ḍā tānu
sanna sesinaṭṭiseyi jalajalamai mīm̐dam̐bārĕ
munniḍi yammagum̐ doḍu muṁchīnā tānu
(||iṁka||)
machchiga navvinanavvu māmiḍibuvvayi tām̐kĕ
ichcham̐ jittajunammauda ĕṟam̐gam̐ḍā tānu
achchabu bŏmmajaṁkĕna laśhogamai tām̐kĕ
kŏchchi mariyu naṁpĕ paigŏsarā tānu
(||iṁka||)
kappuramu vaṁṭimāḍa kammani jājai tām̐kĕ
yĕppuḍu paṁchabāṇāla nĕṟam̐gam̐ḍā tānu
ippuḍe śhrī veṁkaḍeśhum̐ ḍem̐givachchi nannum̐ gūḍĕ
kappi kānivi maṁchivigām̐ jesĕ tānu