ఇంకనైనా రాఁగదవే ఇదె నీ విభుఁడు వచ్చె
(॥పల్లవి॥)
ఇంకనైనా రాఁగదవే ఇదె నీ విభుఁడు వచ్చె
లంకెలఁ బెనఁగితేను సంకెలేక వుండును
(॥ఇంక॥)
చనవులు గలిగితే చలము పనికిరాదు
మనసు లెనసితేను మంకులు మాను
తనవులు సోఁకితేను తఱితో సిగ్గులు వీడు
కనుచూపులు నాటితే కాఁకలు చల్లారును
(॥ఇంక॥)
పలుకు లొడఁబడితే భయమేమియును లేదు
వలపు లొనఁగూడితే వాసులుండవు
కొలువులు గలిగితే కోరి యెడమాట లొద్దు
సెలవి నవ్వు లూరితే చింతలు పొదలవు
(॥ఇంక॥)
ఆయములంటితేను అరగొరలే లేవు
పాయక వద్దనుండితే పంగెము గాదు
యీయెడ శ్రీవేంకటేశు నెనసితి విపు డిట్టె
చేయిచ్చి సేసవెట్టితే సిలుగెల్లాఁ బాసును
(||pallavi||)
iṁkanainā rām̐gadave idĕ nī vibhum̐ḍu vachchĕ
laṁkĕlam̐ bĕnam̐gidenu saṁkĕlega vuṁḍunu
(||iṁka||)
sanavulu galigide salamu panigirādu
manasu lĕnasidenu maṁkulu mānu
tanavulu som̐kidenu taṟido siggulu vīḍu
kanusūbulu nāḍide kām̐kalu sallārunu
(||iṁka||)
palugu lŏḍam̐baḍide bhayamemiyunu ledu
valabu lŏnam̐gūḍide vāsuluṁḍavu
kŏluvulu galigide kori yĕḍamāḍa lŏddu
sĕlavi navvu lūride siṁtalu pŏdalavu
(||iṁka||)
āyamulaṁṭidenu aragŏrale levu
pāyaga vaddanuṁḍide paṁgĕmu gādu
yīyĕḍa śhrīveṁkaḍeśhu nĕnasidi vibu ḍiṭṭĕ
seyichchi sesavĕṭṭide silugĕllām̐ bāsunu