Imkanainaa mokkave nee vinnidigi shalavugaa

ఇంకనైనా మొక్కవే నీ విన్నిటికి శలవుగా
Language

(॥పల్లవి॥)
ఇంకనైనా మొక్కవే నీ విన్నిటికి శలవుగా
కంకి సేసేవు వలపు కటకటా యేమే

(॥ఇంక॥)
యేకతానఁ బతితోడ నేమన్నా నమరుగాక
వాకుచ్చి ఇందరిలోనా వా దడతురా
ఆకడ నవ్వీ నతఁడు ఆనలు వెట్టేవు నీవు
కాకు సే సేవు వలపు కటకటా యేమే

(॥ఇంక॥)
చెంతనుండే యట్టే వేళ చెనకఁగఁ జెల్లుఁ గాక
పంతమునఁ గొలువులోఁ బచ్చి సేతురా
సంతసించె నిన్ను నాతఁడు జంకించేవు నీవైతే
గంత గట్టేవు వలపు కటకటా యేమే

(॥ఇంక॥)
కూడిన యిప్పటి వేళ కొసరఁ దగవు గాక
యేడనైనా రట్టుసేసి యెచ్చరింతురా
యీడనె శ్రీ వేంకటేశుఁ డితవాయఁ గలసేవు
గాడిఁ బెట్టేవు వలపు కటకటా యేమే

(||pallavi||)
iṁkanainā mŏkkave nī vinniḍigi śhalavugā
kaṁki sesevu valabu kaḍagaḍā yeme

(||iṁka||)
yegadānam̐ badidoḍa nemannā namarugāga
vāguchchi iṁdarilonā vā daḍadurā
āgaḍa navvī nadam̐ḍu ānalu vĕṭṭevu nīvu
kāgu se sevu valabu kaḍagaḍā yeme

(||iṁka||)
sĕṁtanuṁḍe yaṭṭe veḽa sĕnagam̐gam̐ jĕllum̐ gāga
paṁtamunam̐ gŏluvulom̐ bachchi sedurā
saṁtasiṁchĕ ninnu nādam̐ḍu jaṁkiṁchevu nīvaide
gaṁta gaṭṭevu valabu kaḍagaḍā yeme

(||iṁka||)
kūḍina yippaḍi veḽa kŏsaram̐ dagavu gāga
yeḍanainā raṭṭusesi yĕchchariṁturā
yīḍanĕ śhrī veṁkaḍeśhum̐ ḍidavāyam̐ galasevu
gāḍim̐ bĕṭṭevu valabu kaḍagaḍā yeme