Imkanainaa dayamjoodu meebenu neevu

ఇంకనైనా దయఁజూడు మీపెను నీవు
Language

(॥పల్లవి॥)
ఇంకనైనా దయఁజూడు మీపెను నీవు
లంకెలకే నీతోను లాఁచీఁ దాను

(॥ఇంక॥)
తలఁపులో మోము దాఁచఁజాలక రమణి
మలసి సొలసి నీతో మాటలాడీని
కలువకన్నుల యాస కడుఁ దమిరేఁచఁగాను
పలుమారు నిన్నుఁదప్పక చూచీని

(॥ఇంక॥)
అక్కరతోఁ దనవిరహము చల్లార్చు మంటాను
పుక్కిట నూర్పులు ముంచి పోసీ నీకె
యిక్కువైనకోరికలు యీరికె లొత్తఁగాను
చిక్కించుక నీకొలువు సేసీ నిపుడు

(॥ఇంక॥)
వేడుక నిన్నుఁ బెండ్లాడ విన్నవించ వచ్చి లోలో
మేడెపు సిగ్గులతోడ మెరసీ నిదే
జాడతో శ్రీవేంకటేశ సతి నిట్టె కూడితివి
వాడిక నీగుణాలను వర్నన సేసీని

(||pallavi||)
iṁkanainā dayam̐jūḍu mībĕnu nīvu
laṁkĕlage nīdonu lām̐sīm̐ dānu

(||iṁka||)
talam̐pulo momu dām̐sam̐jālaga ramaṇi
malasi sŏlasi nīdo māḍalāḍīni
kaluvagannula yāsa kaḍum̐ damirem̐sam̐gānu
palumāru ninnum̐dappaga sūsīni

(||iṁka||)
akkaradom̐ danavirahamu sallārsu maṁṭānu
pukkiḍa nūrbulu muṁchi posī nīgĕ
yikkuvainagorigalu yīrigĕ lŏttam̐gānu
sikkiṁchuga nīgŏluvu sesī nibuḍu

(||iṁka||)
veḍuga ninnum̐ bĕṁḍlāḍa vinnaviṁcha vachchi lolo
meḍĕbu sigguladoḍa mĕrasī nide
jāḍado śhrīveṁkaḍeśha sadi niṭṭĕ kūḍidivi
vāḍiga nīguṇālanu varnana sesīni