ఇంకమీఁద వచ్చేపని కిప్పు డేఁటికే
(॥పల్లవి॥)
ఇంకమీఁద వచ్చేపని కిప్పు డేఁటికే
మంకు దీరఁ దన్నింతలో మంచివానిఁ జేసేనా
(॥ఇంక॥)
కానీ లేవె తనమాట కల్లనేనా యిందరిలో
నాన నిచ్చి వెనకనె నవ్వేఁ గాక
ఆన లేల పెట్టుకొనీ నంతలోనె లే దంటా
నే నిట్టే యిందుకు తన్ను నిజమరి అనేనా
(॥ఇంక॥)
తడవ నేలె నేను తనగుణా లిందరిలో
వడి వెట్టి మరఁగున వంచేఁ గాని
తొడిఁబడఁ జేయ వట్టీ దోస మన్నా మానఁడు
వొడఁబడి యిందుకే నే నొక్కటి యైతినా
(॥ఇంక॥)
దంట నై యలుగ లేనె తనుఁ గోపించేవేళ
వొంటిఁ జిక్కించుక వేరె వొరసేఁ గాక
యింటిలోన శ్రీవెంకటేశుఁడిట్టె నన్ను గూడె
అంటి ముట్టి తొంటివెంగే లాడక మానేనా
(||pallavi||)
iṁkamīm̐da vachchebani kippu ḍem̐ṭige
maṁku dīram̐ danniṁtalo maṁchivānim̐ jesenā
(||iṁka||)
kānī levĕ tanamāḍa kallanenā yiṁdarilo
nāna nichchi vĕnaganĕ navvem̐ gāga
āna lela pĕṭṭugŏnī naṁtalonĕ le daṁṭā
ne niṭṭe yiṁdugu tannu nijamari anenā
(||iṁka||)
taḍava nelĕ nenu tanaguṇā liṁdarilo
vaḍi vĕṭṭi maram̐guna vaṁchem̐ gāni
tŏḍim̐baḍam̐ jeya vaṭṭī dosa mannā mānam̐ḍu
vŏḍam̐baḍi yiṁduge ne nŏkkaḍi yaidinā
(||iṁka||)
daṁṭa nai yaluga lenĕ tanum̐ gobiṁcheveḽa
vŏṁṭim̐ jikkiṁchuga verĕ vŏrasem̐ gāga
yiṁṭilona śhrīvĕṁkaḍeśhum̐ḍiṭṭĕ nannu gūḍĕ
aṁṭi muṭṭi tŏṁṭivĕṁge lāḍaga mānenā