Imkaanela veṟabu yeemtagu lomtunnadaa

ఇంకానేల వెఱపు యీఁతకు లోఁతున్నదా
Language

(॥పల్లవి॥)
ఇంకానేల వెఱపు యీఁతకు లోఁతున్నదా
వంకలొత్తి చక్కఁజేయ వద్ద నే నుందానను

(॥ఇంకా॥)
చెలరేఁగి నీవింత సిగ్గులువడుదురా
పెలుచుమాటల నాపె పిలువఁగాను
తలవంచుకోకువయ్య కలసాజమే ఇది
చెలువ లెవ్వరేమనినాఁ జెప్పేనే నుత్తరము

(॥ఇంకా॥)
పక్కన నీవింతలోనే పరాకులు సేతురా
తెక్కుల నీకొంగువట్టి తియ్యంగాను
తక్క కేమి నవ్వేవయ్య తగిలెఁ దొల్లె మనసు
చిక్కిన వారికినెల్లాఁ జెప్పే నే నుత్తరము

(॥ఇంకా॥)
సారె నీవింతలో సన్నలు సేయుదురా
గారవించి కాఁగిటఁ గలయఁగాను
యీరీతి శ్రీవేంకటేశ యేలితి విఁ(వి?) దరి నిట్టె
చేరి నీకు నాకెకును చెప్పే నే నుత్తరము

(||pallavi||)
iṁkānela vĕṟabu yīm̐tagu lom̐tunnadā
vaṁkalŏtti sakkam̐jeya vadda ne nuṁdānanu

(||iṁkā||)
sĕlarem̐gi nīviṁta sigguluvaḍudurā
pĕlusumāḍala nābĕ piluvam̐gānu
talavaṁchugoguvayya kalasājame idi
sĕluva lĕvvaremaninām̐ jĕppene nuttaramu

(||iṁkā||)
pakkana nīviṁtalone parāgulu sedurā
tĕkkula nīgŏṁguvaṭṭi tiyyaṁgānu
takka kemi navvevayya tagilĕm̐ dŏllĕ manasu
sikkina vāriginĕllām̐ jĕppe ne nuttaramu

(||iṁkā||)
sārĕ nīviṁtalo sannalu seyudurā
gāraviṁchi kām̐giḍam̐ galayam̐gānu
yīrīdi śhrīveṁkaḍeśha yelidi vim̐(vi?) dari niṭṭĕ
seri nīgu nāgĕgunu sĕppe ne nuttaramu