ఇంకానేల వట్టియాన లేమిటికిఁ బెట్టేవు
(॥పల్లవి॥)
ఇంకానేల వట్టియాన లేమిటికిఁ బెట్టేవు
అంకెఁ జూచితే గురుతు లద్దములో నున్నవి
(॥ఇంకా॥)
యీతల నాపె నీవు యెదరించినప్పుడే
చూతమువో మీలోని సుద్దులెల్లాను
మాతో నింతేసి యేల మరిఁగులు వెట్టేరు
కాతరపుమేఁతలు కాయలుగాచున్నవి
(॥ఇంకా॥)
మనసిచ్చి మీరిద్దరు మాటలాడినప్పుడే
వినేముగా వీనుల మీ వేడుకలెల్లా
పెనఁగి మావద్దనేల బేరి బోకొట్టవిచ్చేరు
దినము మీ సరితలు తీగెలు వా రున్నవి
(॥ఇంకా॥)
అలమేలుమంగ నీవు నంటూడినప్పుడే
తెలియరాదా మోములతేటలెల్లాను
మలసి శ్రీవేంటేశ మమ్ము నెంత మన్నించేరు
వలపులమీరతులు వాండ్లెక్కివున్నవి
(||pallavi||)
iṁkānela vaṭṭiyāna lemiḍigim̐ bĕṭṭevu
aṁkĕm̐ jūside gurudu laddamulo nunnavi
(||iṁkā||)
yīdala nābĕ nīvu yĕdariṁchinappuḍe
sūdamuvo mīloni suddulĕllānu
mādo niṁtesi yela marim̐gulu vĕṭṭeru
kādarabumem̐talu kāyalugāsunnavi
(||iṁkā||)
manasichchi mīriddaru māḍalāḍinappuḍe
vinemugā vīnula mī veḍugalĕllā
pĕnam̐gi māvaddanela beri bogŏṭṭavichcheru
dinamu mī saridalu tīgĕlu vā runnavi
(||iṁkā||)
alamelumaṁga nīvu naṁṭūḍinappuḍe
tĕliyarādā momuladeḍalĕllānu
malasi śhrīveṁṭeśha mammu nĕṁta manniṁcheru
valabulamīradulu vāṁḍlĕkkivunnavi