Imkaanela kosarevu yimtini

ఇంకానేల కొసరేవు యింతిని
Language

(॥పల్లవి॥)
ఇంకానేల కొసరేవు యింతిని
సుంకులు గావా గోరిసూటివాటు

(॥ఇంకా॥)
చిగురుఁజిత్తము లోనిచేఁగతనములే కావా
నగియేటిచెలిమోవినగవులు
మొగి విచ్చకకురిసేమోవితేనెలే కావా
పగటున నీతోడి పలుకులు

(॥ఇంకా॥)
వుదుటుఁగాంక్షలలోని వురుఁదాళ్లే కావా
సుదతి నిన్నుఁ జూచేచూపులు
వదలుఁ బయ్యెదలొని వన్నెకానికలు గావా
మెదలుఁజన్నులనీమేనిసోఁకులు

(॥ఇంకా॥)
వల్లేటి వలపుల సంగడి సేసలు గావా
చెల్లుఁబడి నింతిసేసే చేఁతలు
మెల్లనె శ్రీవేంకటేశ మించి యేలితి వాపెను
కొల్లలుగావా నీతో గొనకొన్నరతులు

(||pallavi||)
iṁkānela kŏsarevu yiṁtini
suṁkulu gāvā gorisūḍivāḍu

(||iṁkā||)
sigurum̐jittamu lonisem̐gadanamule kāvā
nagiyeḍisĕlimovinagavulu
mŏgi vichchagagurisemovidenĕle kāvā
pagaḍuna nīdoḍi palugulu

(||iṁkā||)
vuduḍum̐gāṁkṣhalaloni vurum̐dāḽle kāvā
sudadi ninnum̐ jūsesūbulu
vadalum̐ bayyĕdalŏni vannĕgānigalu gāvā
mĕdalum̐jannulanīmenisom̐kulu

(||iṁkā||)
valleḍi valabula saṁgaḍi sesalu gāvā
sĕllum̐baḍi niṁtisese sem̐talu
mĕllanĕ śhrīveṁkaḍeśha miṁchi yelidi vābĕnu
kŏllalugāvā nīdo gŏnagŏnnaradulu