Imkaanela daamsevu yimdaridonu

ఇంకానేల దాఁచేవు యిందరితోను
Language

(॥పల్లవి॥)
ఇంకానేల దాఁచేవు యిందరితోను
తెంకినే మీభావములు తెలిసితి మిపుడు

(॥ఇంకా॥)
చింకచూపులతోఁ గడుసిగ్గున మొక్కీ నీకు
కుంకుమగుబ్బలతోడికొమ్మ యదివో
కంకణాలసూడిగాలు గల్లుగల్లురనఁగాను
అంకెల నారతులెత్తీ నందముగా నీకు

(॥ఇంకా॥)
నెలవిచిఱునవ్వుల చేరి కానుకిచ్చీతి నీకు
నిలువుఁ దురుముతోడినెలఁ తదివో
మొలనూలికాంతులు ముంచి నీపైఁ గప్పఁగాను
వెలయ నాలవట్టము విసరీని నీకు

(॥ఇంకా॥)
వెక్కసపుఁ బ్రియముల విన్నపాలు సేసీ నీకు
చక్కెరమోవితోడిసతి యదివో
చక్కనిశ్రీవేంకటేశ జాజులు పై రాలఁగాను
ఇక్కడ నలమేల్‌మంగ ఇరవాయ నీకు

(||pallavi||)
iṁkānela dām̐sevu yiṁdaridonu
tĕṁkine mībhāvamulu tĕlisidi mibuḍu

(||iṁkā||)
siṁkasūbuladom̐ gaḍusigguna mŏkkī nīgu
kuṁkumagubbaladoḍigŏmma yadivo
kaṁkaṇālasūḍigālu gallugalluranam̐gānu
aṁkĕla nāradulĕttī naṁdamugā nīgu

(||iṁkā||)
nĕlavisiṟunavvula seri kānugichchīdi nīgu
niluvum̐ durumudoḍinĕlam̐ tadivo
mŏlanūligāṁtulu muṁchi nībaim̐ gappam̐gānu
vĕlaya nālavaṭṭamu visarīni nīgu

(||iṁkā||)
vĕkkasabum̐ briyamula vinnabālu sesī nīgu
sakkĕramovidoḍisadi yadivo
sakkaniśhrīveṁkaḍeśha jājulu pai rālam̐gānu
ikkaḍa nalamel‌maṁga iravāya nīgu