Imkaanela daamsevu yedurugudurugaanu

ఇంకానేల దాఁచేవు యెదురుగుదురుగాను
Language

(॥పల్లవి॥)
ఇంకానేల దాఁచేవు యెదురుగుదురుగాను
పొంకపు నీ గుణములు యీ బూమెల్లా నెఱఁగదా

(॥॥)
పుంకించి నిన్నిందరిలో వొడివట్టి తీసితేను
జంకించి వద్దని యేల సన్నసేసేవు
కుంకుమచన్నులచొప్పు గురిగా నీ మేన నంటె
లంకెల నీసుద్దులు యీలలన లెరఁగరా

(॥॥)
జల జాక్షులనుఁ గూడ జాణవని పొగడితే
నెలిమి నోరేల మూనే వింతలోనను
పలుసోఁకులమచ్చము పట్టిఇయ్యఁదొడఁగెను
వొళవై ననీవోజు యీవొద్దివా రెరఁగరా

(॥॥)
సొరది నీనాసంది చుట్టరికాలు చెప్పితే-
నెరవు నేయకుమని యేల మొక్కేవు
నిరతి శ్రీ వేంకటేశ నిలువెల్లాఁబచ్చిదేరె
పొరి నీపొందు లిరుగుపొరుగు లెఱఁగరా

(||pallavi||)
iṁkānela dām̐sevu yĕdurugudurugānu
pŏṁkabu nī guṇamulu yī būmĕllā nĕṟam̐gadā

(||||)
puṁkiṁchi ninniṁdarilo vŏḍivaṭṭi tīsidenu
jaṁkiṁchi vaddani yela sannasesevu
kuṁkumasannulasŏppu gurigā nī mena naṁṭĕ
laṁkĕla nīsuddulu yīlalana lĕram̐garā

(||||)
jala jākṣhulanum̐ gūḍa jāṇavani pŏgaḍide
nĕlimi norela mūne viṁtalonanu
palusom̐kulamachchamu paṭṭiiyyam̐dŏḍam̐gĕnu
vŏḽavai nanīvoju yīvŏddivā rĕram̐garā

(||||)
sŏradi nīnāsaṁdi suṭṭarigālu sĕppide-
nĕravu neyagumani yela mŏkkevu
niradi śhrī veṁkaḍeśha niluvĕllām̐bachchiderĕ
pŏri nībŏṁdu lirugubŏrugu lĕṟam̐garā