Imkaanela daamsevu imtaguvachchem banulu

ఇంకానేల దాఁచేవు ఇంతకువచ్చెఁ బనులు
Language

(॥పల్లవి॥)
ఇంకానేల దాఁచేవు ఇంతకువచ్చెఁ బనులు
సంకలే కానతీరాదా సమ్మతించేఁ గాని

(॥॥)
చక్కెరవంటిమాటలు సతి నీతో నాడికాదా
చొక్కించెను నిన్నునిట్టె సులభానను
చక్కనిమొగము చూచి సన్నలు సేసే కాదా
నెక్కొనుతమకమెల్లా నీకు రేఁగెను

(॥॥)
గాలాలవంటిచూపు లొక్కటఁ దగిలించికాదా
తాలిమి నీమనసెల్లాఁ దక్కఁగొనెను
మేలిమిచన్నులు నీమే నిట్టె తాఁకించికాదా
కీలుకొన్న వలపులు కెరలించెను

(॥॥)
లతలవంటిచేతుల లలి గాఁగిలించికాదా
రతిరహస్యములఁ గరఁగఁజేసెను
యితవై శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
కతకారియాపెకాదా కళ లెసఁగించెను

(||pallavi||)
iṁkānela dām̐sevu iṁtaguvachchĕm̐ banulu
saṁkale kānadīrādā sammadiṁchem̐ gāni

(||||)
sakkĕravaṁṭimāḍalu sadi nīdo nāḍigādā
sŏkkiṁchĕnu ninnuniṭṭĕ sulabhānanu
sakkanimŏgamu sūsi sannalu sese kādā
nĕkkŏnudamagamĕllā nīgu rem̐gĕnu

(||||)
gālālavaṁṭisūbu lŏkkaḍam̐ dagiliṁchigādā
tālimi nīmanasĕllām̐ dakkam̐gŏnĕnu
melimisannulu nīme niṭṭĕ tām̐kiṁchigādā
kīlugŏnna valabulu kĕraliṁchĕnu

(||||)
ladalavaṁṭisedula lali gām̐giliṁchigādā
radirahasyamulam̐ garam̐gam̐jesĕnu
yidavai śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
kadagāriyābĕgādā kaḽa lĕsam̐giṁchĕnu