Imkaanaa nenoo yissee romta | tana

ఇంకానా నేనూ యిస్సీ రోఁత । తన
Language

(॥పల్లవి॥)
ఇంకానా నేనూ యిస్సీ రోఁత । తన-
వంకలాడేవారి పొందు వదలకుమనవే

(॥ఇంకా॥)
అప్పుడే నేనాడనా అడకు నే రానని
యిప్పుడే పిలువనంపె యిదేమో కాక
చెప్పరమ్మ చెలులు చిల్లులాయఁ జిత్తము
తప్పనిబొంకనివాఁడు తాఁదానే కడనే

(॥ఇంకా॥)
కంటా నే నవ్వనా కాంతాఁ దానుఁ గూడుండఁగ
ఇంటికిఁ దానేల వచ్చె నిదేమో కాక
అంటకురమ్మ మీరు ఆయనాయఁ దగవులు
తుంటరి తన బాసలు తొల్లిటిసే కడనే

(॥ఇంకా॥)
దగ్గరితే మొక్కనా తనతో నే మొకమోడి
యెగ్గుదీ బుజ్జగించీ యిదేమో కాక
అగ్గమై శ్రీవేంకటేశుఁ డంతలోనె నన్నుఁ గూడె
సిగ్గరిపెండ్డికొడుకు చేలువుఁడే కదవే

(||pallavi||)
iṁkānā nenū yissī rom̐ta | tana-
vaṁkalāḍevāri pŏṁdu vadalagumanave

(||iṁkā||)
appuḍe nenāḍanā aḍagu ne rānani
yippuḍe piluvanaṁpĕ yidemo kāga
sĕpparamma sĕlulu sillulāyam̐ jittamu
tappanibŏṁkanivām̐ḍu tām̐dāne kaḍane

(||iṁkā||)
kaṁṭā ne navvanā kāṁtām̐ dānum̐ gūḍuṁḍam̐ga
iṁṭigim̐ dānela vachchĕ nidemo kāga
aṁṭaguramma mīru āyanāyam̐ dagavulu
tuṁṭari tana bāsalu tŏlliḍise kaḍane

(||iṁkā||)
daggaride mŏkkanā tanado ne mŏgamoḍi
yĕggudī bujjagiṁchī yidemo kāga
aggamai śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalonĕ nannum̐ gūḍĕ
siggaribĕṁḍḍigŏḍugu seluvum̐ḍe kadave