Imkaanaa naado ninumaa remtigi neegu

ఇంకానా నాతో నినుమా రేఁటికి నీకు
Language

(॥పల్లవి॥)
ఇంకానా నాతో నినుమా రేఁటికి నీకు
కొంకు గొస రేమి గల్లాగోర దీర్చేఁ గాని

(॥ఇంకా॥)
నిక్కి నిక్కి చూడకురా నీవు దొల్లి బలివద్ద
నిక్కి చూచినట్టి నీటె చాలు
చక్క మాటలాడకురా సరి నమృతము పంచే
చక్కటి నాడినయట్టి సటలేచాలు

(॥ఇంకా॥)
నవ్వకురా నీవు నాతో నాఁడు హిరణ్యకశిపు
నవ్వుతోఁ జీరినయట్టి నటనే చాలు
రవ్వఁ గాలఁ జిమ్మకురా రచ్చలోన బండికాల
నవ్వలఁ దుమురు సేసినదియే చాలు

(॥ఇంకా॥)
సిగ్గు వడకురా నీవు చేరి పురసతులతో
సిగ్గు విడిచిన నీ చెలువే చాలు
వొగ్గి కూడి పాయకరా వొంటినే శ్రీవేంకటేశ
యెగ్గు లల్లా మఱచితి నింత నీకుఁ జాలు

(||pallavi||)
iṁkānā nādo ninumā rem̐ṭigi nīgu
kŏṁku gŏsa remi gallāgora dīrsem̐ gāni

(||iṁkā||)
nikki nikki sūḍagurā nīvu dŏlli balivadda
nikki sūsinaṭṭi nīḍĕ sālu
sakka māḍalāḍagurā sari namṛtamu paṁche
sakkaḍi nāḍinayaṭṭi saḍalesālu

(||iṁkā||)
navvagurā nīvu nādo nām̐ḍu hiraṇyagaśhibu
navvudom̐ jīrinayaṭṭi naḍane sālu
ravvam̐ gālam̐ jimmagurā rachchalona baṁḍigāla
navvalam̐ dumuru sesinadiye sālu

(||iṁkā||)
siggu vaḍagurā nīvu seri purasadulado
siggu viḍisina nī sĕluve sālu
vŏggi kūḍi pāyagarā vŏṁṭine śhrīveṁkaḍeśha
yĕggu lallā maṟasidi niṁta nīgum̐ jālu