ఇంకాఁ గొన్ని దలఁచుకో యిటువలెనే
(॥పల్లవి॥)
ఇంకాఁ గొన్ని దలఁచుకో యిటువలెనే
పొంక మెఱుఁగుదువయ్య పొందులు సేయఁగను
(॥ఇంకాఁ॥)
బీరాన నొకతేపేరఁబిలిచేవు నన్ను నిట్టె
నేరుతువయ్యా మాఁటలు నిన్నేమనేను
చేరి యొకతెవిడెము చిమ్మి నాచేతి కిచ్చేవు
దూరుకు వెరవవయ్యా తొలుత నీవు
(॥ఇంకాఁ॥)
జొబ్బిల నొకతెఁ జూచి సొరిది నన్నుఁ జూచేవు
గబ్బిచేఁతలు నీయందె కలవయ్య
వుబ్బున నొకతె నంటి వొళ్లు నాపై వేసేవు
నిబ్బరాల మరునయ్యానీయందే యెపుడు
(॥ఇంకాఁ॥)
నంటున నొక్కతె గూడి నన్ను నట్టె కూడేవు
గొంటవయ్యా అన్నిటాను గుంపించరాదు
ఇంటిలో శ్రీనేంకటేశ ఇందరి జంటసేసేవు
వింటివయ్యా లీ సుద్దులు వివరముగాను
(||pallavi||)
iṁkām̐ gŏnni dalam̐sugo yiḍuvalĕne
pŏṁka mĕṟum̐guduvayya pŏṁdulu seyam̐ganu
(||iṁkām̐||)
bīrāna nŏgadeberam̐bilisevu nannu niṭṭĕ
neruduvayyā mām̐ṭalu ninnemanenu
seri yŏgadĕviḍĕmu simmi nāsedi kichchevu
dūrugu vĕravavayyā tŏluda nīvu
(||iṁkām̐||)
jŏbbila nŏgadĕm̐ jūsi sŏridi nannum̐ jūsevu
gabbisem̐talu nīyaṁdĕ kalavayya
vubbuna nŏgadĕ naṁṭi vŏḽlu nābai vesevu
nibbarāla marunayyānīyaṁde yĕbuḍu
(||iṁkām̐||)
naṁṭuna nŏkkadĕ gūḍi nannu naṭṭĕ kūḍevu
gŏṁṭavayyā anniḍānu guṁpiṁcharādu
iṁṭilo śhrīneṁkaḍeśha iṁdari jaṁṭasesevu
viṁṭivayyā lī suddulu vivaramugānu